టోక్యో ఒలింపిక్స్‌లో మణిపురి మణిహారానికి రజతం
టోక్యో: మణిపూర్ రాష్ట్రానికి చెందిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాన్ని సాధించిన రెండో మహిళగా, రజత పతకాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మీరా ఆ రికార్డును మెరుగుపరచింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో పోటీకి దిగిన ఆమె స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కిలోల బరువునెత్తింది. చైనా లిఫ్టర్ హౌ జిహుయ్ స్నాచ్‌లో 94, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు చొప్పున మొత్తం 202 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇండోనేషియాకు చెందిన ఆయిసా విండీ కాంటికా కాంస్య పతకాన్ని అందుకుంది. కాగా, రజత పతకాన్ని స్వీకరించిన మీరాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీసహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆమె విజయం దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని
మెరిసిన మీరా
RELATED ARTICLES