మెగా సంద్రంగా.. ఎల్‌బి స్టేడియం

ఘనంగా ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుకలు
హాజరైన మెగా హీరోలు
సినిమా విభాగం: కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ’సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, కుచ్చ సుదీప్‌, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్‌ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేదిక వద్ద వాతావరణం కోలాహాలంగా మారింది.
ఒకే వేదికపై పవన్‌, చిరు, రాంచరణ్‌
మెగా హీరోలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దాదాపు పదేళ్ల త ర్వాత ఈ త్రయం ఒకే వేదికపైన కనిపించనుండటం విశేషం. గతంలో ఈ ముగ్గురూ కలిసి జల్సా, మగధీర వేదికలపై కన్పించగా.. ఆ సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించాయి. సో ఈ లెక్కన సైరా నరసింహా రెడ్డి కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ ఖాయం అని ఇక్కడే తెలిసిపోతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డుల సునామీ సృష్టిస్తుందో! ఇక సైరా మూవీ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌ కళ్యాణ్‌ విచ్చేస్తుండగా.. మిగిలిన మెగా హీరోలంతా ఈ వేదికపై కనిపించనున్నారు. మరికొద్ది సేపట్లోనే మెగా హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ ఈ వేదిక వద్దకు చేరుకోనున్నారు. దీంతో ఒకే వేదికపై ఈ మెగా హీరోలను చూడాలని ఆతృతగా ఉన్నారు మెగా అభిమానులు.

DO YOU LIKE THIS ARTICLE?