లీడ్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో క్రికెట్ టెస్టు లో భారత జట్టు చిత్తయింది. ఏకంగా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొం ది. అయితే, ఇంతకు ముందు లార్డ్‌లో జరిగిన రెండో టెస్టును 151 పరుగుల తేడాతో గెల్చుకున్న కారణంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. నాటింహామ్‌లో జరిగిన మొదటి టెస్టును వర్షం వెంటాడిన కారణంగా, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆధిక్యంతో మూడో టెస్టులో బరిలోకి దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (19), అజింక్య రహానే (18) మాత్రమే రెం డంకెల స్కోర్లు సాధించగలిగారు. వీరి తర్వాత అత్యధిక పరుగులు (16) ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి. తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సిం గిల్ డిజిట్‌కే పరిమితం కావడం, భారత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 432 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ జో రూట్ సెంచరీ (121)తో కదం తొక్కగా, రొరి బర్న్ 61, హసీబ్ హమీద్ 68, డేవిడ్ మాలన్ 70 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టరు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండేసి వికెట్లు కూల్చారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులు వెనుకబడి, ఇంగ్లాండ్‌కు గట్టిపోటీని ఇవ్వాల్సిన భారత్ కొంత వరకూ పోరాడింది. కానీ, 99.3 ఓవర్లలో 278 పరుగులు చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ 59, చటేశ్వర్ పుజారా 91, కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 చొప్పున పరుగలు సాధించగా, చివరిలో రవీంద్ర జడేజా 30 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఒలీ రాబిన్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. క్రెగ్ ఓవర్టన్కు మూడు వికెట్లు లభించగా, జేమ్స్ ఆండర్సన మోయిన్ అలీ చెరొక వికెట్‌ను తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఇలావుంటే, ఇప్పుడు ఇంగ్లాండ్, భారత్ చెరొక విజయాన్ని నమోదు చేయగా, మిగతా రెండు టెస్టులు ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చకున్నాయి. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ది ఓవల్ మైదానంలో, చివరిదైన ఐదో టెస్టు 10 నుంచి 14 వరకు మాంచెస్టర్‌లో జరగనున్నాయి. భారత్ తన బ్యాటింగ్ వైఫల్యాల నుంచి బయటపడితేగానీ సిరీస్‌ను గెల్చుకునే అవకాశం లేదన్నది వాస్తవం.
మూడో టెస్టులో భారత్ చిత్తు
RELATED ARTICLES