మురళీ విజయ్‌ మ్యాచ్‌ ఫీజులో కోత

చెన్నై : దేశవాళీ ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు మురళీ విజయ్‌ మ్యాచ్‌ ఫీజు లో 10 శాతం కోత విధించారు. తొలి రోజు టీ విరామ సమయానికి ముందు అశ్విన్‌ వేసిన బంతిని కర్ణాటక బ్యాట్స్‌మన్‌ పవన్‌ దేశ్‌పాండే ఆడాడు. ఆ బంతి కీపర్‌ చేతుల్లో పడింది. అయితే అది బ్యాట్‌కు తగిలి కీపర్‌ చేతుల్లో పడిందని భావించిన తమిళనాడు ఆటగాళ్లు అప్పీల్‌ చేశారు. కానీ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శాంతింపజేయడానికి స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ అనిల్‌.. విజయ్‌ చేతులు పట్టుకోవడం గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?