5-0తో ఢిల్లీ చిత్తు
ప్రణయ్‌కు సమీర్‌వర్మ షాక్
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
ముంబయి: బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నాలుగులో ముంబై రాకెట్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 5- ఢిల్లీ డాషర్స్‌ను చిత్తు చేసింది. ముంబై రాకెట్స్ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో ఢిల్లీపై ఘన విజాయన్ని సాధించారు. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 2 స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ముంబై జట్టు పురుషుల సింగిల్స్‌లో రెండు విజయాలు, పురుషుల డబుల్, మహిళల సింగిల్స్ ఒకొక్క విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ డాషర్స్ మిక్స్డ్ డబుల్స్ ఒక మ్యాచ్‌లోనే గెలుపొందింది.
ప్రణయ్ ఓటమి…
పురుషుల సింగిల్స్‌లో ఢిల్లీ డాషర్స్ స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్‌కు తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ యు వ ఆటగాడు సమీర్ వర్మ (2- 15 15- తేడాతో హె చ్ఎస్ ప్రణయ్‌పై గెలుపొందాడు. తొలి గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఈ పోరులో ఇద్దరూ ఎకరిపై మరొకరు ఎదురుదాడులకు దిగారు. ఒకవైపు ప్రణయ్ దూకుడును ప్రదర్శిస్తుంటే.. మ రోవైపు సమీర్‌వర్మ ధాటిగా ఆడుతూ ఎదురుదాడి చేశా డు. ఇద్దరూ ఒకొక్క పాయింట్ సాధిస్తూ పోవడంతో తొలి గేమ్ ఉత్కంఠంగా సాగింది. చివర్లో ఒక్క పాయింట్ ఆధి క్యం సాధించిన సమీర్ వర్మ 15- ప్రణయ్‌కు షాకిచ్చాడు. తర్వాతి గేమ్‌ను కూడా ఇద్దరూ హోరాహోరీగానే ఆరంభించారు. కానీ తర్వాత దూకుడును పెంచిన సమీర్ వర్మ ప్రణయ్‌పై ఎదురుదాడికిదిగి పాయింట్లు సాధిస్తూ పోయాడు. ఈ క్రమంలోనే సమీర్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లాడు. చివర్లో ప్రణయ్ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. సమీర్‌వర్మ 15 రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు.
అండర్స్ అంటన్సన్ గెలుపు..
ఇక్కడ జరిగిన మరో పురుషుల సింగిల్స్ డెన్మార్క్ స్టార్ ప్రపంచ 17వ ర్యాంకర్ అండర్స్ అంటన్సన్ (2- 15- 15 తేడాతో ప్రపంచ 11వ ర్కాంక్ ఇండోనేషియా స్టార్ టామీ సుగియర్టొను వరుస గేమ్‌లలో చిత్తు చేశాడు. తొలి గేమ్‌ను ఇద్దరూ దూకుడుగా ప్రారంభించారు. వరుసగా పాయింట్లు సాధిస్తూ ఒకరిపై ఒకరు ఒత్తిడిని పెంచారు. ఇద్దరూ పోటాపోటీగా తలపడంతో తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. అయితే చివర్లో ఒక పాయింట్ ఆధిక్యంతో అండర్స్ 15- తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. తర్వాత జరిగిన రెండో గేమ్‌లో అంటన్సన్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగడు. మరోవైపు తొలి గేమ్‌లో దూకుడును ప్రదర్శించిన ఇండోనేషియా ఆటగాడు ఈ గేమ్‌లో తేలిపోయాడు. దీంతో అండర్స్ అంటన్సన్ రెండో గేమ్‌ను 15 గెలుచుకుని విజేతగా నిలిచాడు.
శ్రేయాన్షి సంచలనం..
మహిళల సింగిల్స్‌లో శ్రేయాన్షి పర్దేశి సంచలంన విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో శ్రేయాన్షి (2- 12- 15 15- రష్యా స్టార్ ఎవ్గేనియా కొసెత్స్కయాను చిత్తు చేసింది. తొలి గేమ్‌ను 12 కోల్పోయిన శ్రేయాన్షి తర్వాతి గేమ్‌లో పుంజుకుంది. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగి వరసగా పాయింట్లు చేస్తూ పోయింది. తన ముందు అగ్రశ్రేణి క్రీడాకారిణి ఉన్న బెదరకుండా దూకుడును ప్రదర్శిస్తూ రెండో గేమ్‌ను 15 గెలిచుకుని మ్యాచ్‌ను సమం చేసింది. తర్వాత కీలకమైన నిర్ణయాత్మకమైన గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ చివర్లో వరుస స్మాషర్లతో ఆధిక్యంలో దూసుకుపోయిన శ్రేయాన్షి 15 గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది.
ఇక పురుషుల డబుల్స్‌లో ముంబై రాకెట్స్ జోడీ లీ యంగ్ డే, కిమ్ జి జంగ్ (2- 14- 15- 15- తేడాతో వాంగ్ సిజీ, ఛయ్ బియావ్ ఢిల్లీ డాషర్స్ జంటపై విజయం సాధించింది. నాలుగు విభాగాల్లో విజయాలు సాధించిన ముంబై రాకెట్స్‌కు మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం విజయం దక్కలేదు.