4న కెసిఆర్‌కు మా తడాఖ చూపిస్తాం : రేవంత్‌రెడ్డి
కొడంగల్: నన్ను ఎదుర్కొనేందుకు కెసిఆర్ కుటుంబమంతా కొడంగల్‌కు వరుసకడుతున్నారని, కొడుకు, అల్లుడికి చేతకాకపోవడంతో కెసిఆరే ఇక్కడి ప్రచారానికి రాబోతున్నారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం కొడంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆపద్ధర్మ మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ.. “మీ అయ్య గుంట నక్క వేషాలు, మీ బావ తోడేళ్ల వేషాలు వేస్తున్నారు. కొండగల్ ప్రజల అండతో కొండనైనా ఢీకొంటా. అదే నా ధైర్యం. వంద మంది కెసిఆర్‌లు వచ్చినా పాతాళానికి తొక్కుతా” అంటూ రేవంత్ తీవ్ర పదజాలం సంధించారు. ఇక్కడి ప్రజల అండ దండలతోనే నేను ఈ స్థాయికి వచ్చానని, ఎన్ని బెదిరింపులు చేసినా భయపడనని ఆయన అన్నారు. కోస్గి సిఐ, బొమ్రాస్‌పేట ఎస్‌ఐ అత్యుత్సాహంతో నాపై దాడులకు దిగుతున్నారని, నా అనుచరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముఠాలతో కొడంగల్ ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ, అధికార పెత్తనాన్ని తమపై చూపిస్తున్నారన్నారు. డిసెంబర్ 4న కొడంగల్‌కు వస్తున్న కెసిఆర్‌కు ధీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఆయన ఇంకేమన్నారంటే “సిద్దిపేట నుంచి ఒకడు, షాబాద్ నుంచి మరొకడు కొడంగల్ బయలుదేరారు. డిసెంబర్ 4న కొండగల్ నియోజకవర్గ బంద్‌ను ఉపసంహరించుకుంటున్నాం. కానీ పెద్దెత్తున నిరసనలు తెలుపుతాం. కెసిఆర్‌కు కొండగల్ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. కెసిఆర్ ఉద్యమకారుడు కానేకాదు.. దగుల్బాజీ, దోపిడీదారుడు. నేనే రాజ్యం.. రాజ్యమంటేనే నేను అనే ధోరణీలో కెసిఆర్ ప్రవర్తిస్తున్నారు.
మీ అయ్యవి గుంట నక్క వేషాలు
RELATED ARTICLES