మాస్క్‌ లేదు.. కేసు వినను..

లాయర్‌కు స్పష్టం చేసిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి
ముంబయి: చట్టాలను, నిబంధనలను గౌరవిం చి, ఆచరించడంలో ఆదర్శప్రాయంగా ఉండాల్సిన కోర్టుల్లోనే నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎవరు స్పందించాలి? ఓ లాయర్‌ చర్యను ఆక్షేపించిన న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం అం దరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. కోర్టు రూమ్‌లో మాస్క్‌ లేకుండా ఒక లాయర్‌ కనిపించడంతో, ఆయనకు సంబంధించిన కేసును వినేది లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పి, నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశా రు. కోర్టు శనివారం అందుబాటులో ఉంచిన సమాచారం ప్రకారం, ఈనెల 22న ఒక కేసు ను వాదించడానికి ఓ లాయర్‌ మాస్క్‌ లేకుండా నే కోర్ట్‌ హాల్‌లోకి వచ్చారు. కొవిడ్‌ 19 కారణం గా చాలా రోజులు మూతపడిన కోర్టుల్లో భౌతిక విచారణ మళ్లీ ప్రారంభమైనప్పుడు, విస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కోర్టు ఆవరణలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలనేది వాటి లో ఒకటి. కానీ, బాంబే హైకోర్టుకు ఒక న్యాయవాది మాస్క్‌ లేకుండా రవడాన్ని న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్‌ తప్పుపట్టారు. సదరు లా యర్‌ కేసును వినేది లేదని పేర్కొంటూ, కేసును వాయిదా వేశారు. కోర్టుహాల్‌లోకి న్యాయమూ ర్తి ఒక లాయర్‌నే అనుమతిస్తున్నారు. మిగతా వారు పక్కనే ఉన్న గదిలో, తమ వంతు వచ్చే వరకూ వేచి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. కాగా, శనివారం నాటికి మహారాష్ట్రలో మొత్తం 21,38,154 కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో బాంబే హైకోర్టులో ఉన్న కేసులు 3,23,879 కావడం విశేషం.

DO YOU LIKE THIS ARTICLE?