HomeNewsBreaking Newsమార్చి 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు

మార్చి 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌
షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్మీడియెట్‌ బోర్డు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు వార్షిక పరీక్ష లు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం కూడా ఉదయం 9 నుంచి 12గంటల వరకు, మధ్యా హ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 4 వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు బోర్డ్‌ సంయుక్త కార్యదర్శి (పరీక్షలు) నవీన్‌మిట్టల్‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలకు కూడా ఇదే తేదీలు వర్తిస్తాయని , ప్రత్యేకంగా టైమ్‌టేబుల్‌ను విడుదల చేస్తామన్నారు. ఎథిక్స్‌, మానవ విలువలకు సంబంధించి మార్చి 4న, పర్యావరణ విద్యకు సంబంధించిన పరీక్షమార్చి 6న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరగనున్నాయి.

మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌
మార్చి 15 సెకండ్‌ లాంగ్వేజ్‌-1
మార్చి 17 – ఇంగ్లీష్‌ పేపర్‌ -1
మార్చి 20 – మ్యాథమెటిక్స్‌ పేపర్‌ 1ఎ/బాటనీ, పొలిటీకల్‌ సైన్స్‌ పేపర్‌ -1
మార్చి 23- మ్యాథమెటిక్స్‌ పేపర్‌ -1బి/జువాలజీ పేపర్‌ -1, హిస్టరీ పేపర్‌ -1
మార్చి 25- ఫిజిక్స్‌ పేపర్‌ -1,/ఎకనామిక్స్‌ పేపర్‌ -1
మార్చి 28- కెమెస్ట్రీ పేపర్‌-1,/ కామర్స్‌ పేపర్‌-1
మార్చి 31- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1/బిడ్జ్‌ కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌ -1(బైపిసి స్టూడెంట్స్‌)
ఏప్రిల్‌ -3- మాడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1/జియోగ్రఫి పేపర్‌-1)

ద్వితీయ సంవత్సరం సబ్జెక్ట్‌

మార్చి 16- సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-11
మార్చి 18 – ఇంగ్లీష్‌ పేపర్‌ -11
మార్చి 21- మ్యాథమెటిక్స్‌ పేపర్‌ -11ఎ/బొటనీపేపర్‌11,పొలిటీకల్‌ సైన్స్‌ పేపర్‌-11
మార్చి 24- మ్యాథమెటిక్స్‌పేపర్‌-11బి/జువాలజీ పేపర్‌-11, హిస్టరీ పేపర్‌ -11
మార్చి 27- ఫిజిక్స్‌ పేపర్‌-11,/ఎకనామిక్స్‌ పేపర్‌ 11.
మార్చి 29- కెమెస్ట్రీ పేపర్‌-11,/ కామర్స్‌ పేపర్‌-11
ఏప్రిల్‌ -4- మాడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -11/జియోగ్రఫి పేపర్‌-11)

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments