మాజీ ఎంఎల్‌సి కెఆర్‌ ఆమోస్‌ మృతి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం 1969లో చేపట్టిన తెలంగాణ ఉద్యమనాయకుడు, మాజీ ఎంఎల్‌సి కె.ఆర్‌.ఆమోస్‌ గురువారం హైదరాబాద్‌లో మరణించారు. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. టిఎన్‌జివో సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రా ష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా ఆమోస్‌ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయారు. చాలా కాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆమోస్‌ గత కొంత కాలం కింద టిఆర్‌ఎస్‌లో చేరారు.
సిఎం, ప్రముఖుల సంతాపం : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంఎల్‌సి కె.ఆర్‌.ఆమోస్‌ మృతికి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆమోస్‌ ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తిని, త్యాగనిరతిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.రామారావు, రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆమోస్‌ మృతి పట్ల సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారని, ఆయన తెలంగాణ సమాజానికి చేసిన సేవలు ఎల్లకాలం గుర్తు ఉంటాయని కెటిఆర్‌ ఒక సంతాప సందేశంలో పేర్కొన్నారు. సంతాపం వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?