HomeNewsBreaking Newsమాగాణి 3.5, చెలక 7.5ఎకరాలు

మాగాణి 3.5, చెలక 7.5ఎకరాలు

గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర,
పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం
ఉపసంఘం ముందుకు వచ్చిన ప్రతిపాదన
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారందరికీ రేషన్‌కార్డులిస్తాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డును అందజేయనున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన ఉపసంఘము సభ్యులు ఆరోగ్యశాఖామంత్రి దామోదరరాజ నరసింహా, రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పౌర సరఫరాల కార్యదర్శి డి.ఎస్‌ చౌహన్‌, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్‌ చొంగతి తదితరులు పాల్గొన్నారు. కొత్త తెల్ల రేషన్‌ కార్డుకు మంజూరీకి సంబంధించిగ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర,మాగాణి 3.50 ఎకరాలు,చెలక 7.5 ఎకరాలు , పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘము ముందుకు వచ్చిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ కార్డులు అందేలా లోతైన అధ్యయనం చేయనున్నమన్నారు. ఇందులో భాగంగా విధి,విధినాల రూపకల్పనలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చేయనున్నామని,లోకసభ, రాజ్యసభ, శాసనసభ,శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, ఇందుకు వారందరికీ లేఖల ద్వారా సమాచారం అందించాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్‌ చౌహన్‌ కు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. అదేవిధంగా సక్సేనా కమిటీ సిఫారసులతో పాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్‌ కార్డుల
అర్హత ప్రమాణాలు పరిశీలించనున్నట్లు వెల్లడించారు. అంతర్‌ రాష్ట్రాల నుండి తెలంగాణా కు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని, వారికి అక్కడో… ఇక్కడో అన్న అప్షన్‌ ఇవ్వాలనే ప్రతిపాదనపైఉప సంఘము చర్చించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments