అనుకూలంగా 454 …
వ్యతిరేకంగా 2 ఓట్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభలో ఆముద ముద్ర లభించింది. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓటు వేయగా, కేవలం ఇద్దరు సభ్యులు మాత్ర మే వ్యతిరేకించారు. యుపిఎ ప్రభుత్వం 2008లో రూపొందించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ప్రస్తుతం అమలవుతున్న రీతిలోనే మహిళా రిజల్వేషన్లలో ఎస్‌సి, ఎస్‌టి సబ్ కోటాలు ఉంటాయని నాటి బిల్లు స్పష్టం చేసింది. అయితే, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి)లకు కూడా కోటా ఇవ్వాలన్న డిమాండ్ లోక్‌సభలో వినిపించింది. ఈ డిమాండ్ చేసిన కొన్ని పార్టీలు వ్యతిరేకించడంతో లోక్‌సభలో ఆమోదానికి నోచుకోలేదు. తాజాగా మంగళవారం మోడీ సర్కారు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. బుధవారం సుమారు 7 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. దిగువ సభలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందడం ఇదే తొలిసారి. ఈ బిల్లు గురువారం రాజ్యసభకు వెళుతుంది. అక్కడ కూడా చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది. భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకుముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రారంభం అయింది. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. స్లిప్‌పై ఆకుపచ్చ ‘ఎస్’ అని, ఎరుపు ‘నో’ అని, దానిపై సభ్యుడు సంతకం చేసి, వారి పేరు, ఐడి నెంబర్, నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం పేరు, తేదీ వంటి వివరాలు రాయాలని లోక్ సభ కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ సూచించారు. స్లిప్పులు పంపిణీ చేసిన తర్వాత నుంచి మళ్లీ సభ్యుల నుంచి తీసుకొనే వరకూ ఎవరూ తమ సీట్లు వదిలి వెళ్లవద్దని సూచించారు. అనంతరం ఓటింగ్ జరిగ్గా, సభ్యులు బిల్లును ఆమోదించారు. గతంలో రాజ్యసభ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఆతర్వాత లోక్‌సభ ఆమోద ముద్ర లేకపోవడంతో ఆ బిల్లుకు కాలం చెల్లింది. ఇప్పుడు మరోసారి రాజ్యసభ ముందుకు వెళుతున్న బిల్లుకు ఆమోదం లభించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత కూడా, కోటా అమలుకావడానికి మరికొంతకాలం వేచి ఉండక తప్పదవ. జనాభా గణని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకులోక్‌సభ ఆమోదం
RELATED ARTICLES