HomeNewsBreaking Newsమరో పోరుకు సిద్ధ్దమైన టీమిండియా

మరో పోరుకు సిద్ధ్దమైన టీమిండియా

థ్రిల్లింగ్‌ విక్టరీతో కొత్త ఏడాదిని ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భా గంగా గురువారం పుణే వేదికగా జరగనున్న రెం డో టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యా చ్‌ విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా అ దే జోరులో రెండో టీ20 కూడా గెలిచి మరో మ్యా చ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకోవాలనుకుంటుంది. తద్వారా మూడో టీ20ని ప్రయోగాలకు వాడుకోవచ్చని, బెంచ్‌ బలాన్ని పరీక్షించుకోవచ్చని భావిస్తోంది. మరోవైపు గెలవాల్సిన మ్యా చ్‌లో ఓడిన శ్రీలంక.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. రెండో టీ20లో విజయం సాధిం చి సిరీస్‌ రేసులో నిలవాలని భావిస్తోంది. ఈ క్ర మంలో రెండో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనూహ్య కాంబినేషన్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. దాంతో టీమ్‌ పెద్దగా మా ర్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే పుణే పిచ్‌ స్లోగా ఉన్న నేపథ్యంలో టీమిండియా స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, యు జ్వేంద్ర చాహల్‌ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు న్నా.. నాలుగో స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే హర్షల్‌ పటేల్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరిపెట్టుకుంటామని భావిస్తే మాత్రం టీమ్‌ కాంబినేషన్‌లో ఎలాం టి మార్పు ఉండదు. పిచ్‌ కండిషన్స్‌ బట్టి తుది జ ట్టును ఎంపిక చేయనున్నారు. స్టార్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ రెండో టీ20 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అతను మొకాలి గా యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో క్యాచ్‌ అందుకునేందుకు డైవ్‌ చేసినప్పుడు సంజూ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే సంజూ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ముంబైలోనే ఉన్న అతను వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది. ఒకవేళ సంజూ శాంసన్‌ దూరమైతే రాహుల్‌ త్రిపాఠికి అవకాశం దక్కవచ్చు. లేదంటే సుందర్‌ను ఆడించవచ్చు. తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌(5) దారుణంగా విఫలమయ్యా డు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజూ.. అనవసర షాట్‌తో పెవిలియన్‌ చేరాడు. కాంబినేషన్‌లో ఎ లాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ కొనసాగడం ఖా యం. గిల్‌ విఫలమైనా.. అతనికి హార్దిక్‌ అండ ఉంది. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా.. కీపింగ్‌లో సత్తా చాటాడు. ఫస్ట్‌ డౌన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నాడు. తొలి టీ20లో విఫలమైన అతను భారీ ఇన్నింగ్స్‌ ఆ డాల్సిన అవసరం ఉంది. నాలుగో స్థానంలో సంజూ ఆడనుండగా.. ఐదో స్థానంలో హార్దిక్‌ పాం డ్యా, ఆరో స్థానంలో దీపక్‌ హుడా బరిలోకి దిగనున్నాడు. దీపక్‌ హుడా తొలి మ్యాచ్‌లో దుమ్మురేపాడు. స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌ పటే ల్‌ కూడా మెరుపులు మెరిపించాడు. అంతేకాకుం డా చివరి ఓవర్‌లో 13 పరుగులను డిఫెండ్‌ చేసి భారత్‌కు అద్భుత విజయా న్నం దించాడు. 8వ స్థానంలో హర్షల్‌ పటేల్‌ స్థానంలో చోటు దక్కించుకున్న ప్లేయర్‌ బరిలోకి దిగనున్నాడు. పేసర్లు శివ మ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌లకు డోకా లేదు. ఫస్ట్‌ టీ20లో ఈ ఇద్దరూ మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన యుజ్వేంద్ర చాహల్‌ సత్తా చాటాల్సి ఉంది. లేకుంటే పూర్తి జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌/రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌/కుల్దీప్‌ యాదవ్‌/వాషింగ్టన్‌ సుందర్‌, శివం మావి

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments