వాషింగ్టన్ : మన సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతాయి. 9వ గ్రహంగా పరిగణించే ఫ్లూటోను ఇంకా డ్వార్ఫ్ (మరగుజ్జు) గ్రహంగానే భావిస్తున్నారు. మన లాంటి గ్రహాలు ఇంకా వున్నాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెపుతున్నారు. అయితే మన సౌర వ్యవస్థలో కాకుండా దీనికి ఆవలివైపున ఏకంగా 45 కొత్త గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే మన సౌర కుటుంబం తరహా వ్యవస్థలు ఇంకా చాలా వున్నాయన్న వాదనకు ఇది బలం చేకూరుతున్నది. సౌర వ్యవస్థకు ఆవలివైపున ఉన్న గ్రహాల గుంపులను ధృవీకరించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ గ్రహాల గుంపును కనుగొన్నట్లు గత నెలలోనే ప్రకటించారు. అయితే సరిగ్గా 45 గ్రహాలు ఉన్నట్లుగా సంఖ్యను తాజాగా నిర్ధారించారు. అలాగే ఒక మరగుజ్జు రోదసీని కూడా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. అది కూడా మన రోదసీకి అత్యంత సమీపలోనే ఉన్నట్లు గుర్తించారు. హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈ మరగుజ్జు రోదసీని కనుగొన్నట్లు వారు తాజాగా ప్రకటించారు. నాసాకు చెందిన కెప్లర్, సౌదీ అరేబియాకు చెందిన గాయా స్పేస్ టెలిస్కోప్‌ల నుంచి లభ్యమైన సమాచారాన్ని ఒక చోట చేర్చిన ఖగోళ శాస్త్రజ్ఞులు సుదీర్గ పరిశోధన చేసిన మీదట సరిగ్గా 44 గ్రహాలున్నట్లు కనుగొన్నారు. ఈ గ్రహాలన్నీ భిన్నమైన వాతావరణ రీతులను కలిగి వున్నాయని కూడా పేర్కొన్నారు. ఈ గ్రహాల్లో నాలుగు గ్రహాలు మాత్రం తమ మాతృనక్షత్రాల చుట్టూ కేవలం 24 గంటల్లోపే పరిభ్రమిస్తున్నాయని జపాన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టోక్యో గ్రాడ్యుయేట్ విద్యార్థి జాన్ లివింగ్‌స్టన్ తెలిపారు. భూమి కన్నా ఇవి చాలా చిన్నగా వున్నాయని తెలిపారు. నాసా కెప్లర్ స్పేస్‌క్రాఫ్ట్ తీసిన చిత్రాల ఆధారంగా దీనికి సంబంధించిన డిజిటల్ దృశ్యాలను చిత్రీకరించారు.
మరగుజ్జు రోదసీ, 45 గ్రహాలు!
RELATED ARTICLES