మయన్మార్‌లో… ఆగని హింసాకాండ

నిరసనకారులపై సైన్యం దుశ్చర్యలు
యాంగూన్‌: ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దెదించి సైన్యం పగ్గాలు చేపట్టిన మయన్మార్‌లో భద్రతా దళాల హింసాకాండ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో నిరసనలు కూడా రెట్టించిన స్ఫూర్తితో కొనసాగుతూనే ఉన్నా యి. మయన్మార్‌ ప్రాచీన రాజధాని, యునెస్కో వారసత్వ స్థలం బగాన్‌ నగరంలో పోలీస్‌లు ఆదివారం నిరసనకారులపై కాల్పులకు తెగబడ్డారు. ఇందులో కనీసం ఐదుగురు గాయపడ్డారని సా క్ష్యాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల ద్వారా తెలుస్తోంది. కాగా రబ్బర్‌ బు ల్లెట్‌ కారణంగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే తూటాలతో కూడా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మయన్మార్‌లో చాలా నగరాలు, పట్టణాలు సహా అత్యధిక పర్యాటకులను ఆకర్షించే బగాన్‌ నగరంలోనూ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే భద్రతా దళాలు భారీగా బలప్రయోగంతో, మూకుమ్మడి అరెస్టులతో నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఐక్యరాజ్య సమితి మానవ హ క్కుల కార్యాలయం ప్రకారం భద్రతా దళాల దా డుల్లో ఫిబ్రవరి 28న కనీసం 18, మార్చి 3న 38 మంది మరణించినట్లు సమాచారం. మయన్మార్‌లోని రెండు ప్రధాన నగరాలు యాంగూన్‌, మాండలేలో పోలీస్‌లు నిరసనకారులపై అణచివేతకు పాల్పడుతున్నారు. హెచ్చరిక కాల్పులు, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, స్టన్‌ గ్రెనేడ్లను ప్రయోగించారు. శనివారం రాత్రి నిరసనకారులు, వారి మద్దతుదార్లపై పోలీస్‌లు నిర్బంధాలకు తెగబడ్డారని యాంగూన్‌కు చెందిన వార్తలు స్పష్టంచేస్తున్నాయి. ఇలా ఉంటే సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీకి చెందిన ఓ నాయకుడు ఆదివారం సైనిక హాస్పిటల్‌లో మరణించాడని తెలుస్తోంది. బాధితుడిని కొట్డడంతో మరణించినట్లు తెలుస్తున్నా, అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, దేశంలో హింసాకాండ ముమ్మరించడంతో సైనిక ప్రభుత్వాన్ని కట్టడిచేసేందుకు అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం ఫిబ్రవరిలో గద్దెదింపిన విషయం తెలిసిందే. అధికార నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ నాయకురాలు సూకీ, ఆ పార్టీ సీనియర్‌ నాయకులను సైన్యం నిర్బంధించింది. ఇదిలా ఉంటే మధ్య మయన్మార్‌ నగరం మొనీవాలో శనివారం సైన్యం ఆధ్వర్యంలో తయారయ్యే బీర్‌ను పారబోస్తూ వినూత్నంగా నిరసన తెలిపడం గమనార్హం.
కనీసం 18, మార్చి 3న 38 మంది మరణించినట్లు సమాచారం. మయన్మార్‌లోని రెండు ప్రధాన నగరాలు యాంగూన్‌, మాండలేలో పోలీస్‌లు నిరసనకారులపై అణచివేతకు పాల్పడుతున్నారు. హెచ్చరిక కాల్పులు, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, స్టన్‌ గ్రెనేడ్లను ప్రయోగించారు. శనివారం రాత్రి నిరసనకారులు, వారి మద్దతుదార్లపై పోలీస్‌లు నిర్బంధాలకు తెగబడ్డారని యాంగూన్‌కు చెందిన వార్తలు స్పష్టంచేస్తున్నాయి. ఇలా ఉంటే సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీకి చెందిన ఓ నాయకుడు ఆదివారం సైనిక హాస్పిటల్‌లో మరణించాడని తెలుస్తోంది. బాధితుడిని కొట్డడంతో మరణించినట్లు తెలుస్తున్నా, అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, దేశంలో హింసాకాండ ముమ్మరించడంతో సైనిక ప్రభుత్వాన్ని కట్టడిచేసేందుకు అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం ఫిబ్రవరిలో గద్దెదింపిన విషయం తెలిసిందే. అధికార నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ నాయకురాలు సూకీ, ఆ పార్టీ సీనియర్‌ నాయకులను సైన్యం నిర్బంధించింది. ఇదిలా ఉంటే మధ్య మయన్మార్‌ నగరం మొనీవాలో శనివారం సైన్యం ఆధ్వర్యంలో తయారయ్యే బీర్‌ను పారబోస్తూ వినూత్నంగా నిరసన తెలిపడం గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?