మత్తు కోసం ప్రయత్నిస్తే…ప్రాణాలే పోయాయి!

ఆంధ్రప్రదేశ్‌లో శానిటైజర్‌ తాగి 13 మంది మృతి
పంజాబ్‌లో కల్తీ మద్యానికి 38 మంది బలి
కురిచేడ్‌ / చండీగఢ్‌ : ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌లో ఘోరం జరిగింది. మత్తు కోసం ప్రయత్ని స్తే ప్రాణాలే పోయాయి. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌ను తాగిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లో 13 మంది దుర్మరణం పాలు కాగా, కల్తీ మద్యం సేవించి పంజాబ్‌లో 38 మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ను తాగిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కి చేరింది. కురిచేడు మండల కేంద్రంలో స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉండే ఇద్దరు యాచకులు మద్యానికి బానిసలై కొన్ని రోజులుగా శానిటైజర్లు తాగుతున్నట్లు గ్రామస్థులు తెలిపా రు. గురువారం రాత్రి కడుపులో తీవ్ర మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి ప్రాణాపా య స్థితిలో కొట్టుకుంటుండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి అతనిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించా డు. ఇదే విధంగా కురిచేడులోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో నివాసం ఉండే కడియం రమణయ్య (28) గురువారం ఉదయం శానిటైజర్‌, నాటు సారా కలిపి తాగుతుండగా స్థానికులు గుర్తించి వారించారు. అయినప్పటికీ ఆయన తాగి ఇంటి కి వెళ్లిపోయాడు. రాత్రి అపస్మారక స్థితిలో పడి ఉన్న రమణయ్యను కుటుంబసభ్యులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి ఘటనే ఇదే జిల్లాలో చోటుచేసుకుంది. పామూరులో మరో ముగ్గురు శానిటైజర్‌ తాగి మృత్యువాత పడ్డారు. మృతులు షేక్‌ ఖాదర్‌,, మల్లికార్జున్‌, రోశయ్యగా గుర్తించారు. కురిచేడులో శానిటైజర్‌ తాగి అస్వస్థతకు గురైన వారిలో శుక్రవారం ఉదయం ఆరుగురు, మధ్యాహ్నం ఒకరు మృతి చెందారు. దీంతో గురువారం రాత్రి నుంచి మృతుల సంఖ్య పదికి చేరింది. మృతులు అ నుగొండ శ్రీను (25), భోగెమ్‌ తిరుపతయ్య(37), గుంటక రామిరెడ్డి (60), రమణయ్య (65) రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు(40), ఛార్లెస్‌ (45), అగస్టీన్‌ (47)గా గుర్తించారు. కరోనా నేపథ్యంలో గత 10 రోజులుగా మద్యం దుకాణాలు తెరుచుకోక పోవడంతో యాచకులు, స్థానికులు శానిటైజర్‌ తాగారని గ్రామస్థులు తెలిపారు. కరోనా కేసులు పెరగడంతో కురిచేడు ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో మద్యం దొరక్క పలువురు శానిటైజర్‌కు అలవాటుపడుతున్నారు. ఇదిలా ఉండగా, కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ప్రకశాం జిల్లా ఎస్‌పి సిద్దార్థ కౌశల్‌ తెలిపారు. పోలీసు బృందాలు ఘటనాస్థలిని పరిశీలించాయి. 10 రోజులుగా శానిటైజర్‌ తాగుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టు ప్రక్కల విక్రయిస్తున్న శానిటైజర్స్‌ను సీజ్‌ చేసి పరీక్షలకు పంపిస్తాం. శానిటైజర్‌ నేరుగా తాగారా, వేరే ద్రవంతో కలిపి తాగారా? అనేది పరిశీలించాల్సి ఉంది అని ఎస్‌పి తెలిపారు.
పంజాబ్‌లోని మూడు జిల్లాల్లో విషాధ ఘటనలు
పంజాబ్‌లోని మూడు జిల్లాల్లో కల్తీ మద్యానికి 38 మంది బలయ్యారు. ఘటనలపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మెజిస్టీరియల్‌ దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి అమృత్‌సర్‌, బటాలా, టర్న్‌ టరాన్‌ జిల్లాల్లో ఈ మరణాలు సంభవించినట్లు ఒక అధికారిక ఉత్తర్వులో అధికారులు వెల్లడించారు. మొదటి ఐదు మరణాలు అమృత్‌సర్‌ టర్సిక్కాలో ముచ్చల్‌, టంగ్రా గ్రామాల్లో జులై 29న రాత్రి నమోదైనట్లు పంజాబ్‌ డిజిపి దిన్‌కర్‌ గుప్తా తెలిపారు. గురువారం సాయంత్రం మరో ఇద్దరు ముచ్చల్‌ గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంకో వ్యక్తిని టంగ్రా ఆసుపత్రి నుంచి అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్‌ ఆసుపత్రికి తరలించగా, అక్కడే అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరువాత కూడా ముచ్చల్‌ గ్రామంలో మరో ఇద్దరు, బటాలాలో ఇంకో ఇద్దరు కూడా కల్తీ మద్యం సేవించడం వల్ల మృత్యువాత పడ్డారు. అదే విధంగా శుక్రవారం కూడా బటాలాలో ఐదుగురు మరణించారు. దీంతో నగరంలో మృతుల సంఖ్య ఏడుకు చేరినట్లు డిజిపి తెలిపారు. టర్న్‌ టంగ్రాలో కూడా నలుగురు చనిపోయినట్లు ఆయన చెప్పారు. కల్తీ కల్లు తాగి వివిధ ప్రాంతాల్లో 38 మంది మృత్యువాత పడడంపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ జలంధర్‌ డివిజనల్‌ కమిషనర్‌తో మెజిస్టీరియల్‌ విచారకు ఆదేశించారు. విచారణ ద్వారా నిజాలు, ఘటనలు జరగడానికి గల పరిస్థితులు వెలుగులోకి వస్తాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా, ముచ్చల్‌ గ్రామ నివాసి అయిన బల్విందర్‌ కౌర్‌ అనే వ్యక్తిని సెక్షన్‌ 304, ఎక్సైజ్‌ చట్టంలోని నిబంధనల కింద పోలీసులు అరెస్టు చేసినట్లు డిజిపి చెప్పారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారు ఎవరైనా, ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని సిఎం హామీనిచ్చారు. రాష్ట్రంలో ఉన్న కల్తీ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయాలని సిఎం పోలీసులను ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?