కొత్త పాస్ పుస్తకాలతో సామాన్యులకు కష్టాలు
కబ్జాదారులకు వత్తాసుగా అధికారులు!
అధికారుల వద్దలేని మొదటి విడత వివరాలు
భూములను కోల్పోతున్న పేద రైతులు
ప్రజాపక్షం / రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ; ‘నా భర్త చనిపోయి నాలుగేండ్లయింది. ఆయ న పేరు మీద ఉన్న భూమిని నా పేరు మీద చేయమంటే చేస్తలేరు. ఎంఆర్ఒ ఆఫీస్ సుట్టూ తిరిగి అలిసిపోయిన.. నేను బతుకుడే కష్టంగా ఉంది..’ ఇదీ కడ్తల్ మండల కేంద్రానికి చెంది న ఎగిరెట్టి అలివేలు ఆవేదన.. ఈమె ఒక్కరే కాదు రంగారెడ్డి జిల్లాలో అన్ని మండలాల్లోని గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్నవారే.. భూ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల తయారీని ప్రారంభించిన ప్రభు త్వం సామాన్యుల బాధలను వినేందుకు కూ డా సిద్ధంగా లేదు. వారసత్వంగా వస్తున్న భూ ములను కోల్పోయి భయంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని జిల్లా ప్రజలు వాపోతున్నారు. ఏండ్లు గడుస్తున్నా ఏ ఒక్క గ్రామంలోనూ వందశాతం పాస్ పుస్తకాల పంపిణీ చేపట్ట లేదంటేనే ప్రభుత్వం చిత్తశుద్ధి అర్థమవుతోంది.
పొంతనలేని అధికారుల గణంకాలు
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,70,658 ఖాతాలు ఉండగా, 2,91,792 వ్యవసా య ఖాతాలు ఉన్నాయి. అధికారుల గణంకాల ప్రకారం రెండో విడతలో 71,428 మందికి పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని వివిధ మండలాల్లో పంపిణీ చేయాల్సిన పాస్ పుస్తకాల వివరాలు గమనిస్తే.. కొందుర్గులో 26, తలకొండపల్లిలో 10, ఆమన్‌గల్‌లో 13, గం డిపేటలో ఆరు, కడ్తాల్ మండలంలో ఐదు, కేశంపేటలో రెండు, బాలాపూర్‌లో ఒకటి మాత్రమే పంపిణీ చేయాల్సి ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే ఆమనగల్ మండల అధికారుల సమాచా రం ప్రకారం 31 ఉన్నట్టు చెబుతున్నారు.
అందుబాటులో లేని సమాచారం
డిజిటల్ సంతకాలు, కొత్త పాస్ పుస్తకాల పంపిణీని చేపట్టేందు కు ప్రభుత్వం మొదటి విడతలో ఎన్ఐసి సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. రెండో విడతలో దాన్ని తప్పించి ఐఎల్ఎఫ్ఎస్ సంస్థను తీసుకొచ్చింది. అయితే మొదటి విడతలో ఎన్ని పాస్ పుస్తకాలు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
ఎంతమందికి ఇచ్చా రు.. పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఏమిటి వంటి సమాచారం అధికారుల వద్ద లేదు. 2018 జూన్‌లో చేపట్టిన ఈ ప్రక్రియకు సంబంధించి సదరు సంస్థ పూర్తి డేటాను ఇప్పటికీ అప్పజెప్పలేదని సమాచారం. ఎన్ఐసి డేటా లేకుండానే రెండో విడతలో లక్ష్యాన్ని ఎలా నిర్ణయించారంటే సమాధానం చెప్పేవారు కరువయ్యారు.