HomeNewsBreaking Newsభూములకు రెక్కలు

భూములకు రెక్కలు

పెరుగుతున్న భూ కేంద్రీకరణ
వేళ్లూనుకుంటున్న భూస్వామ్య వ్యవస్థ
కొందరి సొంతమవుతున్న వేల ఎకరాలు
పాలేర్లుగా చిన్న, సన్నకారు రైతులు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో  జీవనాధారమైన భూమి… ఇప్పుడు వ్యాపార వస్తువుగా మారింది. భూమి ఆధారంగా లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. సాగు చేసుకునే వారికి తప్ప భూమిపై ఇతరులకు మక్కువ ఉండేది కాదు. వీలైతే సాగు భూ ములను అమ్ముకుని పట్టణ, నగరాలలో నివాస స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేసే వారు. భూమి ఉంటే ఏమీ లాభం అన్న ఆలోచనలో ఉండేవారు. దశాబ్ద కాలంగా భూ విలువ పెరుగుతూ వచ్చింది. తొలుత పట్టణాలు, నగరాల చుట్టూ ఉన్న భూములకు విలువ పెరిగింది. ఇప్పుడు మారుమూల గ్రామాల్లోని సాగు భూములు, బీడు భూములు అనే తేడా లేకుండా అన్నీంటి ధరలకూ రెక్కలొచ్చాయి. ఎప్పుడైతే భూ క్రయ, విక్రయాలు లాభాలను తెచ్చిపెడుతున్నాయో సంపన్న వర్గాల దృష్టి భూమిపై పడింది. స్వాతంత్య్రానికి పూర్వం ఎంత భూమి ఉంటే అంత సంపన్నులుగా గుర్తించే వారు. ఇప్పుడు అదే ఆలోచన మళ్లీ జీవం పోసుకుంది. ఎంత దూరమైనా, ఏ మారుమూల ప్రాంతమైనా భూమి కొనుగోలు చేసేందుకు వెనుకాడడం లేదు. తమ సంపాదనంతా భూమిపై పెడుతున్నారు. వందల, వేల ఎకరాలను సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో ఎక్కడ భూమి దొరికినా ధరతో నిమిత్తం లేకుండా భూమిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో భూమికి కనివిని ఎరుగని ధర వచ్చింది. వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ నాయకులు మారుమూల ప్రాంతాల్లో వందల ఎకరాలు కొనుగోలు చేసి అక్కడ ఒక విలాసవంతమైన ఇల్లు నిర్మించడం స్టేటస్‌ సింబలైంది. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు కూడా వీలైనంత భూమిని కొనుగోలు చేసి వారి వారి సంస్థల పేరుతో బోర్డులు పెడుతున్నారు. సంపన్న కుటుంబాల చేతుల్లో భూమి పొగుపడుతుంది. ఒక్కో కుటుంబం వేల ఎకరాలను హస్తగతం చేసుకోవడంతో సామాజిక పరిస్థితుల్లో పెద్ద మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం, అరెకరం భూములు ఉన్నవాళ్లు అమ్ముకుని పాలేర్లుగా, పెద్దపెద్ద భూ కమతాలలో పనిచేస్తున్నారు. లేదంటే పట్టణాలు, నగరాలలో గుమస్తాలుగా చేరిపోతున్నారు. యంత్రాలు పరుగులు పెడుతుండడంతో పెద్ద భూకమతాలకు రక్షణ కోసం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో పశువుల సంఖ్య రాను రాను తగ్గిపోతుంది. సంపన్నుల మాటలకు రెవెన్యూ అధికారులు తలలాడిస్తుండడంతో వాగులు, వంకలు, డొంకలు, చెరువు శిఖాలు, కుంటలు వారి హస్తగతమవుతున్నాయి. వందల ఎకరాలు కొనుగోలు చేస్తుండడంతో గ్రామీణ రహదారులు (డొంకలు) మాయమవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు పెద్ద పెద్ద భూకమతాల పక్కన సాగు చేసే పరిస్థితి లేక అమ్ముకుంటున్నారు. తెలంగాణలో ఎంత భూమి ఉన్నా రైతుబంధు పేరిట ఎకరాకు సంవత్సరానికి రూ. 10 వేలు బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో, ఇది అదనపు ఆదాయంగా మారింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ ఉమ్మడిజిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంపన్న, వ్యాపార వర్గాలు భూములు కొనుగోలు చేస్తున్నాయి. ఆంధ్రాలో రైతుబంధు లేనందున తెలంగాణలో భూమి కొనుగోలు చేస్తే ప్రతి ఏడాది ఎకరాకు రూ. 10వేలు రావడంతో పాటు ధరలు పెరుగుతుండడం వల్ల తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. భూముల ధరలు పెరగడం పెద్దపెద్ద భూకమతాలు ఏర్పడుతుండడాన్ని మరో కోణంలో చూస్తే క్రమేపీ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ మళ్లి వేళ్లూనుకుంటున్నది. భూములు కొనుగోలు చేసిన వారు సమీప పల్లెలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమకు నచ్చిన వారే స్థానిక ప్రజాప్రతినిధి కావాలని డబ్బు ఖర్చు చేస్తూ తమ అనుకూలురును గెలిపించుకుని పెత్తనం చేస్తున్నారు. చిన్న చిన్న దొరలు ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నారు. తెలంగాణలో దశాబ్దాల నాటి పాత కథలు పునరావృతమవుతున్నాయి. వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరు సాగుభూమి కొనే పరిస్థితి లేదు. రానురాను గ్రామీణ వాతావరణం మారిపోతుంది. భూమి రైతు చేయిదాటిపోతుంటే ఇక రైతన్న నవ్వేదెట్ల.. పాలకుల ఆలోచన ప్రమాదకర పరిస్థితులను తీసుకురానుంది. అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రక్రియలో భాగమే భూస్వామ్య వ్యవస్థకు జీవం పోయడం ప్రాథమిక దశలో కొంత సానుకూలత ఉంటుంది. వీరు రాబట్టే కదా భూముల ధరలు పెరిగింది అనుకోవచ్చు. కానీ ఎప్పుడు పరిస్థితులు ఈ రీతిలో ఉండవు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో పెరుగుతున్న పెద్ద పెద్ద భూకమతాలు ప్రమాదాలకు సంకేతమే. రెక్కలొచ్చాయి. ఎప్పుడైతే భూ క్రయ, విక్రయాలు లాభాలను తెచ్చిపెడుతున్నాయో సంపన్న వర్గాల దృష్టి భూమిపై పడింది. స్వాతంత్య్రానికి పూర్వం ఎంత భూమి ఉంటే అంత సంపన్నులుగా గుర్తించే వారు. ఇప్పుడు అదే ఆలోచన మళ్లీ జీవం పోసుకుంది. ఎంత దూరమైనా, ఏ మారుమూల ప్రాంతమైనా భూమి కొనుగోలు చేసేందుకు వెనుకాడడం లేదు. తమ సంపాదనంతా భూమిపై పెడుతున్నారు. వందల, వేల ఎకరాలను సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో ఎక్కడ భూమి దొరికినా ధరతో నిమిత్తం లేకుండా భూమిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో భూమికి కనివిని ఎరుగని ధర వచ్చింది. వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ నాయకులు మారుమూల ప్రాంతాల్లో వందల ఎకరాలు కొనుగోలు చేసి అక్కడ ఒక విలాసవంతమైన ఇల్లు నిర్మించడం స్టేటస్‌ సింబలైంది. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు కూడా వీలైనంత భూమిని కొనుగోలు చేసి వారి వారి సంస్థల పేరుతో బోర్డులు పెడుతున్నారు. సంపన్న కుటుంబాల చేతుల్లో భూమి పొగుపడుతుంది. ఒక్కో కుటుంబం వేల ఎకరాలను హస్తగతం చేసుకోవడంతో సామాజిక పరిస్థితుల్లో పెద్ద మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం, అరెకరం భూములు ఉన్నవాళ్లు అమ్ముకుని పాలేర్లుగా, పెద్దపెద్ద భూ కమతాలలో పనిచేస్తున్నారు. లేదంటే పట్టణాలు, నగరాలలో గుమస్తాలుగా చేరిపోతున్నారు. యంత్రాలు పరుగులు పెడుతుండడంతో పెద్ద భూకమతాలకు రక్షణ కోసం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో పశువుల సంఖ్య రాను రాను తగ్గిపోతుంది. సంపన్నుల మాటలకు రెవెన్యూ అధికారులు తలలాడిస్తుండడంతో వాగులు, వంకలు, డొంకలు, చెరువు శిఖాలు, కుంటలు వారి హస్తగతమవుతున్నాయి. వందల ఎకరాలు కొనుగోలు చేస్తుండడంతో గ్రామీణ రహదారులు (డొంకలు) మాయమవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు పెద్ద పెద్ద భూకమతాల పక్కన సాగు చేసే పరిస్థితి లేక అమ్ముకుంటున్నారు. తెలంగాణలో ఎంత భూమి ఉన్నా రైతుబంధు పేరిట ఎకరాకు సంవత్సరానికి రూ. 10 వేలు బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో, ఇది అదనపు ఆదాయంగా మారింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ ఉమ్మడిజిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంపన్న, వ్యాపార వర్గాలు భూములు కొనుగోలు చేస్తున్నాయి. ఆంధ్రాలో రైతుబంధు లేనందున తెలంగాణలో భూమి కొనుగోలు చేస్తే ప్రతి ఏడాది ఎకరాకు రూ. 10వేలు రావడంతో పాటు ధరలు పెరుగుతుండడం వల్ల తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. భూముల ధరలు పెరగడం పెద్దపెద్ద భూకమతాలు ఏర్పడుతుండడాన్ని మరో కోణంలో చూస్తే క్రమేపీ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ మళ్లి వేళ్లూనుకుంటున్నది. భూములు కొనుగోలు చేసిన వారు సమీప పల్లెలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమకు నచ్చిన వారే స్థానిక ప్రజాప్రతినిధి కావాలని డబ్బు ఖర్చు చేస్తూ తమ అనుకూలురును గెలిపించుకుని పెత్తనం చేస్తున్నారు. చిన్న చిన్న దొరలు ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నారు. తెలంగాణలో దశాబ్దాల నాటి పాత కథలు పునరావృతమవుతున్నాయి. వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరు సాగుభూమి కొనే పరిస్థితి లేదు. రానురాను గ్రామీణ వాతావరణం మారిపోతుంది. భూమి రైతు చేయిదాటిపోతుంటే ఇక రైతన్న నవ్వేదెట్ల.. పాలకుల ఆలోచన ప్రమాదకర పరిస్థితులను తీసుకురానుంది. అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రక్రియలో భాగమే భూస్వామ్య వ్యవస్థకు జీవం పోయడం ప్రాథమిక దశలో కొంత సానుకూలత ఉంటుంది. వీరు రాబట్టే కదా భూముల ధరలు పెరిగింది అనుకోవచ్చు. కానీ ఎప్పుడు పరిస్థితులు ఈ రీతిలో ఉండవు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో పెరుగుతున్న పెద్ద పెద్ద భూకమతాలు ప్రమాదాలకు సంకేతమే.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments