తుది దశకు ఉప్పల్ భగాయత్ ఇ-వేలం
రూ.వెయ్యి కోట్లకు పైగా ఆశిస్తున్న ప్రభుత్వం
ముగిసిన రిజిస్ట్రేషన్ గడువు
రేపు ఇ లైవ్ డెమో నిర్వహణ
14, 15, 16 తేదీల్లో ప్లాట్ల ఇ
ప్రజాపక్షం/హైదరాబాద్ : అసలే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి ఏ వనరుపై ఆదాయం వచ్చినా ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండిఎ) ఆధ్వర్యం లో హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ భూముల వేలంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూముల వేలం ద్వారా రూ.10వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించికుంది. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్లో ఉప్పల్ భగాయత్ భూ ముల ఇ వేసిన 67 ప్లాట్లతో రూ.677 కోట్ల ఆదాయం వచ్చింది. అవి పోగా ఇంకా 1.65 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో గల 124 ప్లాట్లకు ఈనెల 14, 15, 16 తేదీల్లో హెచ్ఎండిఎ ఆన్లైన్లో వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ బుధవారం ముగిసింది. రియాల్టీ రంగం ఆర్థిక మాద్యం దెబ్బకు స్తబ్ధతతో కొట్టు మిట్టాడుతున్న సందర్భంలో హెచ్ఎండిఎ అధికారులు మరోసారి ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు ఇ నిర్వహిస్తున్నా రు. ఈ సారి 124 ప్లాట్లలో 100 ప్లాట్లు రెసిరెన్షియల్, 9 కమర్షియల్, 15 మల్టీపర్పస్లుగా విభజించి వేలం వేయనున్నారు. మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా 150 నుండి 300 చదరపు గజాల విస్తీర్ణంతో కూడిన చిన్న చిన్న ప్లాట్లను అందుబాటులో ఉంచామని అధికారులు చెప్తున్నారు. కానీ వేలంలో పాల్గొనే వారం తా బడాబాబులు, వ్యాపారులే ఎక్కువ శాతం ఉంటున్నారు. మధ్యతరగతి ప్రజలకు వేలంలో ప్లాట్లు దక్కే పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. ఈసారీ కమర్షియల్, మల్టీపర్పస్ జోన్, రెసిడెన్షియల్ జోన్లలో 300 గజాల విస్తీర్ణం నుంచి 2000 చదరపు గజాల విస్తీర్ణం వరకు ప్లాట్ల సైజులున్నాయి. గతంలో ఉప్పల్ భగాయత్ మొదటి దశలో ప్లాట్లను ఇ వేయగా చదరపు గజానికి అత్యధికంగా రూ.73000 వరకు పలికితే, సగటున రూ.51వేల వరకు గజం ధర పలికింది. అప్పుడు జరిగిన వేలం ప్రక్రియలో స్థిరాస్తి వ్యాపారాలు, బడా పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలు పాల్గొన్న ట్లు తెలుస్తోంది. ఇప్పుడు చేపట్టబోయే వేలంలో కూడా ఆ వర్గాలే ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే మొదటి దశలో వేలానికి వచ్చిన స్పందన వస్తుందో? రాదోనని అధికారులు ఇప్పటి నుంచే అంచనా వేసుకుంటున్నారు. మెట్రో పాలిటన్ నగరాల్లో రియాల్టీ రంగంపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడడంతో గతంలో వలే రియాల్టీ వ్యాపారం ఆశించిన స్థాయి లో లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఇ వేలం జరుగుతుండడంతో ఏ స్థాయిలో ప్లాట్ల ధరలు పలుకుతాయోనని రియల్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఉప్పల్ భగాయత్ ప్లాట్ల రెండవ దశ వేలం ద్వారా విక్రయం విజయవంతమైతే కోకాపేటలోని లేఅవుట్లను కూడా ఇ ద్వారా విక్రయించి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీంతోపాటు భూ సమీకరణపై కూడా ప్రభుత్వం ఇప్పటికే దృష్టిసారించింది. ఇప్పటికే ప్రతాపసింగారం, మోకిలా గ్రామ రైతుల నుంచి 2వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టారు. ఈ భూమని సైతం అభివృద్ధి చేసి హెచ్ఎండిఎ తన ఆదాయాన్ని రూ.వేల కోట్లలో సమకూర్చుకొని ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.