రెండో మ్యాచ్‌లోనూ గెలుపు
ఇండోనేషియాతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ టోర్నీ
జకార్తా: ఇండోనేషియాతో జరుగుతున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ టోర్నీలో భారత మహిళా జట్టు వరుస విజయాలతో జోరును కొనసాగించింది. తొలి మ్యాచ్‌ను 3 గెలుచుకున్న భారత అమ్మాయిలు రెండో మ్యాచ్‌లోనూ 2 గోల్స్‌తో ఇండోనేషియాను చిత్తు చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఆతిథ్య ఇండోనేషియాపై ఘన విజయం సాధించారు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శనించిన భారత జట్టు ఏకపక్షంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. భారత అమ్మాయిలు ప్రత్యర్థి గోల్ పోస్టుపై వరుస దాడులు చేస్తూ మ్యాచ్‌లో దూకుడును ప్రదర్శించారు. భారత్ తరఫున సంజూ తొలి హాఫ్‌లో గోల్ చేసి భారత్‌కు బోణీ చేసింది. తర్వాత రెండో అర్ధ భాగంలో డాంగ్మె గ్రేస్ కళ్లు చెదిరే గోల్‌తో భారత్ ఖాతాలో రెండో గోల్‌ను వేసింది. మరోవైపు ఆథిత్య జట్టు గోల్స్ కోసం ఎంతగానో ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. భారత గోల్ కీపర్ ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొట్టింది.
భారత అమ్మాయిల జోరు
RELATED ARTICLES