ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్ విడుదల
రెండు స్థానాలు దిగువలకు భారత ఫుట్‌బాట్ జట్టు
న్యూ ఢిల్లీ: ప్రపంచ సాకర్ తాజా ర్యాం కింగ్స్ ప్రకారం భారతజట్టు 106 ర్యాంక్ కు పడిపోయింది. గత నెలలో 104వ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు. తనకంటే 40 ర్యాంకులు దిగువన ఉన్న బంగ్లాదేశ్ తో ముగిసిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించడం తో రెం డు స్థానాల మేర ర్యాంక్ ను కోల్పోయిం ది. ప్రపంచ ఫుట్ బాల్ నంబర్ వన్ ర్యాం కును బెల్జియం నిలుపుకోగా. ఫ్రాన్స్ రెం డు, బ్రెజిల్ మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో నిలిచిన జట్లలో ఉరుగ్వే (5), క్రొయేషియా (7), అర్జెంటీనా (9), ఇంగ్ల్ండ (4), పోర్చుగల్, స్పెయిన్, కొలంబియా ఉన్నాయి. ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్యలో మొత్తం 204 దేశాలకు సభ్యత్వం ఉంది. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్‌లో 106వ స్థానం సాధించడం క్రీడాభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
భారత్ @ 106
RELATED ARTICLES