జోహర్నెస్ట్బర్గ్ : సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన ముగిసింది. ఇక భారత్ తన తర్వాత సిరీస్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈనెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ధర్మశాలలో తొలి వన్డే జరుగనుండగా.. 15న లక్నో, 18న కోల్‌కతాలో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. అయితే సోమవారం భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ నాయకత్వం వహిస్తున్నాడు. భారత్‌తో వన్డే సిరీస్ ద్వారా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పునరాగమనం చేస్తున్నాడు. జన్నెమాన్ మలాన్ స్థానంలో డుప్లెసిస్‌ను సీఎస్ఏ ఎంపిక చేసింది. గతడేది వన్డే ప్రపంచకప్ తర్వాత డుప్లెసిస్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. వాన్‌డెర్ డుసెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. లుతో సిప్లామా, కేశవ్ మహారాజ్, కైలీ వెర్రేన్ తమ స్థానాలను కాపాడుకున్నారు. భారత పర్యటనకు చైనామన్ స్పిన్నర్ తబ్రీజ్ షమ్సీ దూరమయ్యాడు. తన భార్య ప్రసవం కారణంగా ఈ టూర్ నుంచి అతడు తప్పుకున్నాడు. షమ్సీ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ జార్జ్ లిండేకు అవకాశం ఇచ్చారు. ఇక గాయం కారణంగా స్టార్ పేసర్ కగిసో రబాడ దూరమైన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికా జట్టు..
క్వింటన్ డికాక్ (కెప్టెన్), టెంబా బవుమా, రస్సీ వాన్ డర్ డస్సెన్, డుప్లెసిస్, కైలీ వెర్రేన్, హెన్రిచ్ క్లాసెన్, డేవి్‌డ మిల్లర్, జాన్ స్మట్స్, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూరన్ హెండ్రిక్స్, ఆన్రిచ్ నోర్జ్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్.
భారత్‌తో వన్డేలకు సఫారీల జట్టు ఎంపిక
RELATED ARTICLES