సంబంధిత శాఖలు, నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత దృష్టి సారిస్తామని కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: సంబంధిత శాఖలు, నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు చేశాక ప్రభుత్వరంగ బ్యాం కుల ప్రైవేటీకరణపై దృష్టి సారిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ, ఎంపికలపై నిర్ణయాలు, షరతులు, నిబంధనలు వంటి సంబంధిత సమస్యలను పరిశీలనలోకి తీసుకుంటామని తెలియజేసింది. వ్యూహాత్మకమైన విక్రయాల విషయాలను 1961 కేంద్ర ప్రభుత్వ ట్రాన్‌శాక్షన్, బిజినెస్ రూల్స్‌కింద మంత్రివర్గ సంఘానికి అప్పగిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలియజేశారు. “నిర్ణయాలు తీసుకోవడానికి ముందుగా అటువంటివాటిని పరిశీలించడానికి ముందుగా సంబంధిత మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాలతో అవసరమైతే నియంత్రణ సంస్థలతో చర్చిస్తామని లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని భావించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మకమైన పెట్టుబడు ఉపసంహరణ విధాన ఆమోదాన్ని కోరుతున్నట్లు ప్రకటించింది. ప్రైవే టు పెట్టుబడులను తోడిపొయ్యడం ద్వారా ప్రభు త్వ రంగ వ్యవస్థలను వృద్ధి సాధనకు వీలుగా మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశమే ఈ విధానం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఈ చర్యలవల్ల ఆర్థిక వృద్ధి, కొత్త ఉద్యోగాలకు, సోషల్ సెక్టర్‌లో పెట్టుబడులకు, అభివృద్ధి కార్యక్రమాలకు తెరతీసినట్లు కాగలదని పేర్కొంది. అదేవిధంగా కరద్ మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ, 2019, 2020,2021,2022 సంవత్సరాల్లో ఇప్పటివరకూ నవంబరు 30వ తేదీనాటికి 135 కంపెనీలు, సంస్థలు, వ్యక్తులపై సిబిఐ 102 కేసులు నమోదు చేసిందని చెప్పారు. మరోప్రశ్నకు క కూడా ఆయన సమాధానం చెబుతూ, ప్రభుత్వరంగ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తులు 2018 లో ప్రాథమికంగా రూ.8,95,601 కోట్లు (14.58 శాతం) గా నమోదయ్యాయని, రిజర్వుబ్యాంకు చేపట్టిన ఆస్తుల నాణ్యతా సమీక్ష కింద దీనిని నిర్థారించామన్నారు. అయినప్పటికీ, పారదర్శకంగా చూస్తే నిరర్థక ఆస్తులు 2022 మార్చి 31వ తేదీ నాటికి రూ.5,40,958 కకోట్లకు తగ్గాయని, ప్రభుత్వం అనుసరించిన గుర్తింపు వ్యూహం,పరిష్కారాలు, పునఃపెట్టుబడులు, సంస్కరణలవల్ల ఇది సాధ్యపడిందన్నారు. ఎన్‌పిఎ అకౌంట్లను అప్‌గ్రేడ్ చేయడంవల్ల ఈ మొండి బకాయలు తగ్గాయన్నారు. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తంగా నిరర్థక ఆస్తుల అకౌంట్ల నుడి రూ.4,80,111 కోట్లు రాబట్టాయని, అప్‌గ్రేడ్ చేసిన ఎన్‌పిఎ రూ.1,44,356 కోట్లుగా నమోదైందని కరద్ చెప్పారు.