జమైకా చిరుత రికార్డును దాటిన అమెరికాకు చెందిన మహిళా స్ప్రింటర్ అలిసన్ ఫెలిక్స్
దోహా: ఆల్ టైమ్ గ్రేట్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ పరుగులు తీయడంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు. సుమారు తొమ్మిది సంవత్సరాల పాటు తన హవా కొనసాగించాడు. ఇక ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో తనదైన ముద్ర వేసిన ఉసేన్ బోల్ట్ రికార్డు తాజాగా బ్రేక్ అయ్యింది. బోల్ట్ వరల్డ్ రికార్డును అమెరికాకు చెందిన మహిళా స్ప్రింటర్ అలిసన్ ఫెలిక్స్ బద్ధలు కొట్టారు. ప్రస్తుతం దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4/400 మీటర్ల మిక్స్డ్ రిలేలో స్వర్ణం పతకం సాధించడంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ అలిసన్ ఫిలెక్స్ 12 స్వర్ణ పతకాలను సాధించి కొత్త రికార్డును నెలకొల్పారు. అంతకుముందు ఈ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరిట ఉండేది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 11 స్వర్ణ పతకాలు సాధించాడు. తాజా పతకంతో ఫెలిక్స్.. బోల్ట్‌ను అధిగమించింది. ఫిలెక్స్ 10 నెలల క్రితం ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పరుగు సమయంలో 10 నెలల కుమార్తె కామ్రిన్ కూడా స్టేడియంలో ఉంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫెలిక్స్‌కు ఇది మొదటి స్వర్ణం కావడం విశేషం. 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్ రెండో లెగ్ నుంచి పోరును ప్రారంభించింది. ఈ టైటిల్‌ను గెలిచే క్రమంలో.. అమెరికా మిక్స్డ్ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకండ్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఇది సరికొత్త వరల్ రికార్డుగా నమోదైంది. ఇలా 4/400 మిక్స్డ్ రిలేలో అమెరికా జట్టు వరల్ రికార్డును బ్రేక్ చేయడం ఇది రెండోసారి. జమైకా, బెహ్రయిన్ జట్లను వెనక్కునెట్టి అమెరికా టైటిల్‌ను అందుకుంది. ఫెలిక్స్ ఓవరాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనలో మహిళల 200 మీటర్ల రేసులో మూడు స్వర్ణాలు గెలుచుకోగా.. 400 మీటర్ల రేసులో ఒక ఒక స్వర్ణ పతకం సాధించారు. 4/100 మీటర్ల మహిళల రిలేలో మూడు స్వర్ణ పతకాలను ఫెలిక్స్ గెలుచుకున్నారు. ఇక 4/400 మీటర్ల మహిళల రిలేలో నాలుగు స్వర్ణ పతకాలను అందుకున్నారు. తాజాగా 4/400 మిక్స్డ్ రిలేలో ఫెలిక్స్‌కు ఇది ఐదో స్వర్ణం.
బోల్ట్ రికార్డు బ్రేక్!
RELATED ARTICLES