అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్
వాషింగ్టన్: తన పట్ల ఎంతో నమ్మకంతో, అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కల్పించిన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అమెరికా ఉపాధ్యక్షురాలు, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్ చివరి రోజున ప్రసంగం చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మొదటి రోజునే మాట్లాడిన కమలా హ్యారీస్ ఆద్యంతం బైడెన్‌ను ప్రశంసలతో ముంచెతాఇ్తరు. ‘మన అద్భుతమైన అధ్యక్షుడు జో బైడెన్ గురించి మాట్లాడడం ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించాలనుకుంటున్నాను. జో.. మీ చారిత్రాత్మక నాయకత్వానికి, దేశానికి జీవితాంతం సేవ అందించిన మీకు ధన్యవాదాలు. మేమంతా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం’ అని కమల అన్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని మూలల నుంచి ప్రజలు వచ్చారని, సమాజంలోని విభిన్న వర్గాలకు చెందినవారు ఇక్కడకు విచ్చేశారని, ఈ నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని డెమొక్రాటిక్ పార్టీ శ్రేణులకు కమల పిలుపునిచ్చారు. కాగా డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ఈ నెల 22న ముగియనుంది. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల ముగింపులో అధ్యక్ష అభ్యర్థిగా కమలనును, వైస్ ప్రెసిడెంట్‌గా మిన్నె సోటా గవర్నర్ టిమ్ వాల్ట్‌ను డెమొక్రాటిక్ పార్టీ అధికారికంగా ఆమోదించనుంది. ఈ సమావేశాల్లో అధ్యక్షుడు జో బైడెతోపాటు మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ కూడా ప్రసంగించనున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ కూడా ప్రసంగించనున్నారు. ఆమెను ఈ సమావేశాల్లో డెమొక్రాట్లు సన్మానించనున్నారు.
కమలా హారిస్ జోరు..
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ప్రతిసారీ హోరాహోరీ పోరు సాగుతుంది. నిజానికి ఈ రెండు పార్టీల మధ్య పోరు కంటే ముందు, ఆయా పార్టీల తరఫున పోటీ చేయడానికి ఎంపికయ్యేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మొదట పార్టీలో నెగ్గి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిస్తేనే వైట్‌హౌస్‌లో నివాసం సాధ్యమవుతుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంతటి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూనే లక్ష్యం వైపు దూసుకెళుతున్నది. 1776 ఫిబ్రవరి 4న స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకూ, అంటే 248 సంవత్సరాల అమెరికా సుదీర్ఘ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా మహిళలకు అధ్యక్ష పదవి దక్కలేదు. అసలు పోటీ చేసే అవకాశమే రాలేదు. సమానత్వం, స్వేచ్ఛ అంటూ నిత్యం గొంతుచించుకొని ప్రపంచానికి హితబోధ చేసే అమెరికాలో పురుషాధిక్యత ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి ఊహించుకోవచ్చు. ఆ ఉక్కు సంకెళ్లను తెంచుకొని, పంజరాలను ఛేజించుకొని, అమెరికా అధ్యక్ష పదవే లక్ష్యంగా కమలా హారిస్ చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి మహిళాలోకం మద్దతునివ్వాలి. రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అవహేళనలు చేసినా, ఎంత మంది ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినా, కమలా హారిస్ భయపడలేదు. వెనకడుగు వేయలేదు. ఆమె పట్టుదలే ప్రజల్లో సానుకూల పవనాలకు కారణమవుతున్నది. తాజా నివేదికను అనుసరించి అమెరికా అధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెమోక్రాటిక్ పార్టీ సదస్సులో ఆమెను ఎంపిక చేయడం, అధికారికంగా పేరును ప్రకటించడం లాంఛనమే అంటున్నారు. ప్రజల్లో కూడా ఆమెకు మంచి మద్దతు లభిస్తున్నదని తెలుస్తోంది. ది అసోసియేటెడ్ ఎన్‌ఒఆర్‌పి సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కమలా హారిస్‌కు అనుకూలత వ్యక్తమైంది. పెద్ద వయసు ్గల వారిలో 48శాతంమందిఆమెవైపే మొగ్గు చూపుతున్నారు. అధ్యక్ష పదవి రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షు జో బైడెన్ వైదొలగిన తర్వాత ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. చాలా మంది పెద్ద వయస్కులు ట్రంప్ పట్ల సానుకూల అభిప్రాయంతో ఉన్నారన్న అంచనాలు తారుమారయ్యాయి. కేవలం 41 శాతం మంది పెద్దవారు ట్రంప్‌ను అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు. అత్యధిక శాతం మంది కమలాహారిస్‌కే అవకాశం దక్కాలని వాదిస్తున్నారు. భారత సంతతికిచెందినప్పటికీ,ఆమెకుఅన్నివర్గాలనుంచిమద్దతు లభించడం విశేషం.
బైడెన్‌కు రుణపడి ఉంటాను
RELATED ARTICLES