బెదిరింపులకు భయపడం

సమ్మెను విరమించే ప్రసక్తే లేదు
ఆర్‌టిసి ప్రైవేటీకరణకు కుట్ర
జెఎసి నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఆర్‌టిసి సమ్మెపై ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన బెదిరింపులకు భయపడేది లేదని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్‌ ఇ.అశ్వద్దామరెడ్డి, కోకన్వీనర్‌ కె.రాజిరెడ్డి అన్నారు. సిఎం ప్రకటనతో ఆర్‌టిసి కార్మికులు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెను విరమించే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్‌టిసిని నడిపిస్తానంటున్న ముఖ్యమంత్రి ప్ర భుత్వాన్ని కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో నడుపుతారా అని వారు ప్రశ్నించా రు. ఆర్‌టిసి సమ్మెపై ప్రభు త్వం నియమించిన కమిటి ఇచ్చే నివేదిక ను చూసే ఓపిక కెసిఆర్‌కు లేదన్నారు. ఆర్‌టిసిపై న్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి వెల్లడించిన నిర్ణయాలపై ఆర్‌టిసి జెఎసి నేతలు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అశ్వధ్ధామరెడ్డి మాట్లాడుతూ ఆర్‌టిసికి ప్రతి రోజు రూ.13 కోట్ల ఆదాయం వస్తుంటే అప్పులు ఎక్కడున్నాయని సిఎంను ప్రశ్నించారు. సిఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పూటకోమాట మాట్లాడే సిఎంపై తమకు నమ్మ కం లేదన్నారు. ప్రభుత్వం ఆర్‌టిసి కార్మికులను ఎంత అణచివేయాలని చూస్తే అంత గట్టిగా కార్మికులు బుద్ది చెబుతామన్నారు. ఏ కార్మికులు కూడా భయపడాల్సిన అవసరం లేదని తమది న్యాయమైన, ధర్మమైన పోరాటమని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రంలో ఏ ఒక్క కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడినా సిఎం బాధ్యత వహి ంచాలని అశ్వద్ధామరెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, ఆర్‌టిసిని బతికించి బకాయిలు చెల్లించాలని సిఎంను కోరారు. సమ్మె విజయవంతంగా కొనసాగుతొంది.  తాము తలపెట్టిన ఆర్‌టిసి సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నదని అంతకు ముందు అశ్వద్ధామరెడ్డి, కోకన్వీనర్‌ కె.రాజిరెడ్డి చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?