HomeNewsNationalబెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ ఇవ్వం

బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ ఇవ్వం

సిపిఐ(ఎం)తో తెగదెంపులు చేసుకుంటేనే కాంగ్రెస్‌తో పొత్తు
టిఎంసి అధినేత్రి, బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ
కోల్‌కతా :
పశ్చిమ బెంగాల్‌లో విపక్ష ఇండియా కూటమి ఇబ్బందులు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సిపిఐ(ఎం)తో కాంగ్రెస్‌ తెగదెంపులు చేసుకోవాలని టిఎంసి అధినేత్రి, బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ హస్తం పార్టీకి షరతు విధించారు. సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా తాను కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వచూపితే తిరస్కరించారని, ఇక ఇప్పుడు తాను ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని దీదీ స్పష్టం చేశారు. గతంలో సిపిఐ(ఎం) తనపై పలుమార్లు భౌతిక దాడులు చేసిందని, తనను నిర్ధాక్షిణ్యంగా కొట్టారని, శ్రేయోభిలాషుల ఆశీస్సులతోనే తాను బతికి బయటపడ్డానని దీదీ గుర్తుచేశారు. లెఫ్ట్‌ను తాను ఎన్నడూ మన్నించనని, సిపిఐ(ఎం)ను అసలు విడిచిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈరోజు సిపిఐ(ఎం)తో జట్టు కట్టినవారిని తా ను మరువనని అన్నారు. మమతా బెనర్జీ బుధవారం మాల్ధాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్ధానాలు ఇచ్చి వారిని గెలిపించుకుంటానంటే వారు ఎక్కువ స్ధానాలను కోరుకున్నారని, మీరు లెఫ్ట్‌తో జట్టుకడితే తాను వారికి ఒక్క సీటు కూడా ఇవ్వనని చెప్పానని దీదీ తేల్చిచెప్పారు. ఇక బెంగాల్‌లో సిపిఐ(ఎం)తో పొత్తు ఉండబోదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో వెల్లడించారు. బిజెపి, టిఎంసితో పోరాడేందుకు లెఫ్ట్‌, కాంగ్రెస్‌తో పాటు లౌకిక పార్టీలు కలిసివస్తాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments