నాగేశ్వరరావు నియామకం వెనుక….

అలోక్‌వర్మను సిబిఐ డైరెక్టర్‌గా తన విధుల నుండి తప్పించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఎం. నాగేశ్వరరావును తాత్కా లిక సిబిఐ డైరెక్టర్‌ గా నియమించటం అత్యంత నాటకీయంగా జరిగింది. ఒక ఐజి స్థాయి అధికారి ని, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ, చరిత్ర లోనే అత్యంత దారుణమైన సంక్షోభంలో కూరుకు పోయిన పరిస్థితుల్లో, ఆ సంస్థ అధినేతగా నియ మించడాన్ని ఆయన గురించి చెప్పకనే చెబుతోంది.
రావు 1986 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌ ఐపిఎస్‌ ఆఫీసర్‌. ఇప్పుడు తాత్కాలిక పదవీకాలంలో ఎలాంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసు కోకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించి నప్పటికీ, తాత్కాలిక డైరెక్టర్‌గా పదవి చేపట్టిన వెనువెంటనే చేసినపని, 13 మంది అధికారులను బదిలీ చేయడం. వారంతా ఆస్తానాపై అవినీతి ఆరోపణ లపై దర్యాప్తు చేస్తున్నవారే. వారంతా వర్మ పక్షం వహిస్తున్న వారే. ఆవిధంగా ఆస్తానాకు తక్షణ ఉపశమనం కల్పించినట్లుంది. ఆస్తానా గుజరాత్‌ కేడర్‌ ఆఫీసర్‌గా, నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహించారు. 2002 గోధ్రా ట్రైన్‌ దహనం అన్నది ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అనే ముఖ్యమంత్రి వాదనను ఆయన సమర్థించారు. పెద్ద స్థాయిలో కుట్ర జరిగిందన్న దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఏప్రిల్‌ 2002 లోనే ఆయన రికార్డు పూర్వకంగా తెలియచేసి వున్నప్పటికీ ఇలా మాట మార్చారు. సిబిఐలో కూడా కేంద్ర ప్రభుత్వానికి విశ్వాసపాత్రంగా ఉంటూ ప్రతిపక్ష నాయకులపై వ్యతిరేకంగా చేసే ఆరోపణలపై దాఖలైన కేసులపై దర్యాప్తు చేపడుతూ వచ్చారు.
ఆస్తానాపై, వర్మ అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, ఆస్తానా నిస్సహాయ పరిస్థితికి నెట్టి వేయబడిన పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వానికి ఆదు కునేందుకు వచ్చిన వ్యక్తిగా నాగేశ్వరరావు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
ఎం. నాగేశ్వరరావు తెలంగాణలోని వరంగల్‌ నుండి వచ్చారు. ఆయన క్యారీర్‌ ప్రారంభంలోనే వివాదాల్లో చిక్కుకున్నారు. ఒడిశా నబ్‌రంగ్‌పూర్‌ జిల్లా ఎస్‌పిగా పని చేస్తున్నప్పుడు విద్యార్థులు మత మార్పిడిలకు పాల్పడకుండా నిరుత్సాహ పరచాలని ప్రభుత్వ పాఠశాలల హెడ్‌ మాస్టర్లకు ఆయన ఒక లేఖ రాసి నట్లు ఆరోపణ వుంది. ఇది సంఘ్‌ పరి వార్‌ శ్రేణులకు అత్యంత ప్రీతికరమైన అంశమని వేరే చెప్ప నక్కరలేదు.
1998లో తిరిగి ఆయన ఇలాంటి వివా దంలోనే చిక్కు కున్నారు. బెర్హంపూర్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ వైస్‌ చైర్మన్‌గా ఆయన మత పరంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు ఆరో పణ. 1998 డిసెంబర్‌ 10న ‘ది హ్యుమేన్‌’ అనే సంస్థ ఒక బహిరంగ వేడుకను నిర్వహిస్తూ ఆయన ను వక్తగా ఆహ్వా నించింది. అక్కడ ఆయన తన ప్రసంగంలో ‘ముస్లింలు, క్రిస్టియన్లు, మార్కిస్టులు” మానవ హక్కులకు అతి పెద్ద ప్రమాదకరం అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రెండవ సర్వసంఘ్‌ చాలక్‌ ఎంఎస్‌ గోల్వాల్కర్‌ చెప్పినదాన్నే పునరుద్ఘాటించారు. “భారత జనాభా లో క్రిస్టియన్లు, ముస్లింలు చాలా చిన్న భాగం. దేశ రెవెన్యూకు వారి తోడ్పాటు నామ మాత్రం. హిందువుల నుండి వసూలు చేసిన పన్నులు మైనారిటీల కోసం ఖర్చు చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే”!అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్మూ- కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని దేశ ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని మాట్లా డారు. ఈ ప్రసంగం వింటున్న పట్నాయక్‌ 1999 ప్రారంభంలో ఒడిశా హైకోర్టులో ఒక పిటిషన్‌ ఫైల్‌ చేశారు. సీనియర్‌ ఐపిఎస్‌ అధికారిగా ఉన్న నాగేశ్వరరావు “ఇండియన్‌ సర్వీస్‌ (కాండక్ట్‌) రూల్స్‌ =ను” ను అతిక్రమించినట్లు పేర్కొన్నారు. మతపరమైన భావోద్వేగాలను, విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా భారత శిక్షాస్మృతి సెక్ష న్‌ 295, 295 ఏలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.
ఆయన ప్రసంగం ముగించిన తరువాత, ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదిం చారు. అది నాగేశ్వరరావు బాధ్య తారహిత, న్యాయ విరు ద్ధమైన, రాజ్యాంగ విరుద్ధ మైన వ్యాఖ్యలను ఖండి స్తూ ఒక ఏకగ్రీవ తీర్మానం ఆమోదించ బడిం దని, ఆ తీర్మానం వివిధ ప్రభుత్వ అధి కారుల మధ్య సర్క్యు లేట్‌ అయిందని, పిటిషన్‌లో పేర్కొ న్నారు. తన చర్య పర్యవ సానాలను ఆయన భరించాల్సి వచ్చింది. రెవెన్యూ డివిజనల్‌ కమిషనర్‌ (ఆర్‌డిసి) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిఐజి) జరిపిన విచారణలో రావు నేరం చేసినట్లు రుజు వైంది. ఆయనను ఉన్నఫళంగా బెర్హంపూర్‌ వెలుపలికి పోస్ట్‌చేశారు. ఈ విషయం రాష్ట్ర శాసనసభలో చర్చకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆయనను బెర్హంపూర్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ పదవి నుండి బదిలీ చేసింది. రావు మతతత్వ తప్పుడు పనులు ఇక్కడతో ఆగిపోలేదు. 2008 జరిగిన కంధమల్‌ అల్లర్ల సందర్భంగా అత్యంత నష్టదాయకమైన నిర్ణయం ఆయన నుండి వెలువడింది. ఒక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజి) ఆఫ్‌ సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌)గా రావు మత పరమైన అల్లర్లు జరిగిన 2008 కంధమల్‌ జిల్లాలో ఉన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సిఆర్‌పిఎఫ్‌ బలగాల కదలికలపై సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమి తులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి పూట ఎలాంటి భద్రత కల్పించ నందువల్ల, రాత్రి పూట క్రిస్టియన్లకు వ్యతిరేకంగా సంఘ్‌ పరివార్‌ గృహ దహనాలకు, దొమ్మీలకు యథేచ్ఛ గా పాల్పడ్డారు. సరియైన విచారణ జరిపితే కాంధమల్‌ జిల్లాలో ఆయన దుష్కృత్యాలు తేలి కగా వెల్లడవుతాయని పట్నాయక్‌ పేర్కొ న్నారు.
ఢిల్లీలో పోస్ట్‌ చేసిన తరువాత కూడా సంఘ్‌ పరివార్‌తో రావు సంబంధాలు సజావుగా సాగా యి. ఇటీవల ఎకనామిక్‌ టైమ్స్‌లో వెలువడిన వార్తప్రకారం, ఆర్‌ఎస్‌ఎస్‌ సలహాదారులతో సంబం ధాలు కొనసాగుతున్నాయి. రావు వివిధ సంస్థలతో పనిచేస్తూ రాష్ట్ర నియంత్రణ నుండి దేవాలయాలకు స్వేచ్ఛ కల్పించడం, మైనారిటీల కు అనుకూలంగా, హిందువులకు వ్యతిరేకంగా వివక్షత చూపే చట్టాలను రద్దు చేయడం, ఆవు మాంస ఎగుమతులపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం వంటి ఇలాంటి ప్రసంగాలు చేసినట్లు, వైఖరి ప్రదర్శించి నట్లు ఆయనపై అనేక యితర ఆరోపణలున్నాయి. ఆయన ఉద్యోగ విధుల్ని అనుసరిస్తున్న అనేక మంది దృష్టిలో నాగేశ్వరరావు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నరేంద్రమోడీ ప్రభుత్వం నియమించ డాన్ని సైద్ధాంతిక పాత్రిపదికపై జరిగిన నియామ కంగా తప్పమెరిట్‌ ప్రాతిపదికగా కనబడటం లేదు.
ఈ సంస్థను స్వీయప్రయోజ నాల కోసం ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం వెనక్కు తగ్గటం లేదని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితు ల్లో, ఇక ముందుకూడా ఈ సంస్థ వివాదాల నుండి దూరంగా ఉండే పరిస్థితి లేదని ఎవరికైనా అర్థమవుతుంది.

అజయ్‌ ఆశీర్వాద్‌ మహాప్రశస్థ

DO YOU LIKE THIS ARTICLE?