HomeNewsBreaking Newsబలపడిన ‘యాస్‌'

బలపడిన ‘యాస్‌’

26న తీరం దాటే అవకాశం
రాష్ట్రాలు అప్రమత్తం
భారీ సంఖ్యలో రైళ్ల రద్దు
భువనేశ్వర్‌/ కోల్కతా :
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. ‘యాస్‌’ తుపానుగా మారి దూసుకొస్తున్నది. సోమవారం నాటికి ఇది తీవ్ర తుపానుగా, తదుపరి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. ఒడిశాలోని పారాదీప్‌ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయం దిశగా 530 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ’యాస్‌’తుపాను ఈ నెల 26వ తేదీ బుధవారం ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుపాను తీవ్రత తో జగత్సింగ్పూర్‌, బాలాసోర్‌, భద్రక్‌లలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తీరం తాకే సమయంలో గంటకు 150 నుంచి 160 కి.మీల వేగంతో బలమైన గాలు లు వీస్తాయని పేర్కొంది. ఒడిశాలోని పూరీ, కటక్‌, జైపూర్‌, మయూర్బంజ్లలో గాలులు గంటకు 120 నుంచి 130 వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండి వివరించింది. కాగా, యాస్‌ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో తూర్పు కోస్తా రైల్వే ముందు జాగ్రత్త చర్యగా 90 రైళ్ల ను రద్దు చేసింది. మరో 10 రైళ్లను రద్దు చేసే అవకాశమున్నట్టు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారులు తెలిపారు. ‘యాస్‌’తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌ఓని తీర ప్రాంత జిల్లాలైన పుర్బా, పశ్చిమ్‌ మేదినిపూర్‌, దక్షిణ, ఉత్తర 24 పరగణాస్తో పాటు హావ్డా, హుగ్లీ జిల్లాల్లోనే అనేక ప్రాంతాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని, రెండుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇలావుంటే, తుపాను మిగిల్చే నష్టాన్ని తగ్గించేందుకు, ఆ తీవ్రతను ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధమైంది. అత్యవసర సాయం కోసం 11 రవాణా విమానాలతోపాటు మరో 25 హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంది. కాగా, తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 99 బృందాలు సాయానికి సిద్ధంగా ఉన్నాయని నేషనల్‌ డిసాస్టర్‌ రిసోర్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) ప్రకటంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, ఒడిశాలో 52, పశ్చిమ బెంగాల్‌లో 35, తమిళనాడులో 5, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 4 బృందాలు ఉన్నట్టు తెలిపింది.ఇలావుంటే, తుపాను ప్రభావం ఉండే వివిధ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఒడిశా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. తుపాను ప్రభావితం ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో, ఈనెల 24, 25 తేదీల్లో దుకాణాలను ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తెరిచే వెసులుబాటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధమైంది. అన్ని శాఖలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తుఫాన్‌ కారణంగా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. తుఫాన్‌ దృష్ట్యా సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ జిల్లాల్లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపారు. కాగా తుపాను కారణంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
అమిత్‌ షా సమీక్ష
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో యాస్‌ తుపాను పరిస్థితులను సమీక్షించారు. అండమాన్‌ నికోబార్‌ ద్వీప సమూహం లెఫ్టినెంట్‌ గవర్నర్‌తోనూ ఆయన మాట్లాడారు. రాగల రెండు రోజుల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి, అన్ని విధాలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఆక్సిజన్‌కు సరఫరాపై దృష్టి..
తుపాను సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తత్ఫలితంంగా రోగులకు ఆక్సిజన్‌ లభించడం కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే, ఆక్సిజన్‌ నింతర సరఫరాపై దృష్టి కేంద్రీకరించారు. తుపాను ప్రభావంతో విదుఆ్యత్‌ స్తంభాలు కూలడం, వైర్లు తెగిపడడం వంటి ప్రమాదాలు ఉన్నందున, ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ సూచించారు. తమ బృందం ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపారు. తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌ఓని తీర ప్రాంత జిల్లాలైన పుర్బా, పశ్చిమ్‌ మేదినిపూర్‌, దక్షిణ, ఉత్తర 24 పరగణాస్తో పాటు హావ్డా, హుగ్లీ జిల్లాల్లోనే అనేక ప్రాంతాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని, రెండుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇలావుంటే, తుపాను మిగిల్చే నష్టాన్ని తగ్గించేందుకు, ఆ తీవ్రతను ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధమైంది. అత్యవసర సాయం కోసం 11 రవాణా విమానాలతోపాటు మరో 25 హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంది. కాగా, తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 99 బృందాలు సాయానికి సిద్ధంగా ఉన్నాయని నేషనల్‌ డిసాస్టర్‌ రిసోర్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) ప్రకటంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, ఒడిశాలో 52, పశ్చిమ బెంగాల్‌లో 35, తమిళనాడులో 5, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 4 బృందాలు ఉన్నట్టు తెలిపింది.
ఇలావుంటే, తుపాను ప్రభావం ఉండే వివిధ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఒడిశా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. తుపాను ప్రభావితం ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో, ఈనెల 24, 25 తేదీల్లో దుకాణాలను ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తెరిచే వెసులుబాటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ కూడా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధమైంది. అన్ని శాఖలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తుఫాన్‌ కారణంగా కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. తుఫాన్‌ దృష్ట్యా సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ జిల్లాల్లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపారు. కాగా తుపాను కారణంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments