పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్.. మరో టోర్నీలో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు చైనా వేదికగా పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో హర్మన్ సేన ఈ టోర్నీ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. ఈ జట్టు లో పలువురు కొత్త ఆటగాళ్లు అవకాశం దక్కించుకున్నారు. సీనియర్ ప్లేయర్స్ అయిన మన్‌దీప్ సిం గ్, లలిత్ ఉపాధ్యాయ, హార్దిక్ సింగ్‌లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌తో వీ డ్కోలు కలిపిన స్టార్ గోల్ కీపర్ శ్రీజేశ్ స్థానంలో క్రి షన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరాలు ఎంపికయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన జట్టులోని 10 మంది ఆటగాళ్లకు ఈ టోర్నీకి ఎంపికయ్యా రు. ఈ టోర్నీలో ఆతిథ్య చైనా తో పాటు భారత్, పాకిస్థాన్, మలేషియా, సౌత్ కొరియా, జపాన్‌లు పాల్గొననున్నాయి. సె ప్టెంబర్ 8న చైనాతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుం ది. సెప్టెంబర్ 9న జపాన్‌తో, సెప్టెంబర్ 11న మలేషియా తో, 12న కొరియా తో, 14న పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ జరగనుంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ రెండు కాంస్యా పతకాలు సాధించడంతో జనాలకు మళ్లీ ఈ ఆటపై ఆసక్తి పె రిగింది. హాకీ మ్యాచ్‌లను చూసేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఫ్రీగా ఎలా చూ డాలంటే.. ఈ టోర్నీకి అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా సోనీ స్పోరట్స్ ఛానెల్ వ్యవహరిస్తోంది. సోనీ టెన్-1,2,3, 4 చానెల్స్‌తో పాటు భాషా చానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షం ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ యాప్‌లో కూడా మ్యాచ్‌లు రానున్నాయి. ఫ్రీగా చూడాలనుకుంటే జియో టీవీ యాప్‌లో సోనీ టెన్ ఛానెల్స్‌ను సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. యూట్యూబ్ వేదికగా సోనీ చానెల్స్‌లో హైలైట్స్ వీక్షించవచ్చు.