ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికలు ముగిసిశా యి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ భారీగా బలగాలను మోహరించినప్పటికీ ఆదివారం పలు ప్రాంతాల్లో హింసాత్మకం సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ అవామి లీగ్, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బిఎన్‌పి) కార్యకర్తలు పలు చోట్ల హింసాకాండకు పాల్పడ్డారు. రెం డు పార్టీల నేతల మధ్య జరిగిన ఘర్షణలో 17 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయ. ఘర్షణల్లో ఎక్కువగా బిఎన్‌పి కార్యకర్తలే మృతి చెందగా.. అధికార పార్టీ అవామి లీగ్‌కు చెందిన కార్యకర్తలు కూడా 5 మంది వరకు అల్లర్ల కారణంగా చనిపోయారు. దాదాపు 8 జిల్లా ల్లో క్షేత్ర స్థాయిల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు ‘ది డైలీ స్టార్ న్యూస్ పేపర్’ తెలిపింది. అధికార పార్టీ చాలా ప్రాంతాల్లో పోలింగ్‌ను మ్యానిపులేషన్ చేసిందని ప్రతిపక్ష బిఎన్‌పి నేతలు ఆరోపించారు. పలు ప్రాంతాల్లో అవామి లీగ్ సభ్యులు తమ పార్టీ సభ్యులను పోలింగ్ ఎజెంట్ల్లుగా ఉండకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. బిఎన్‌పికి చెందిన 10 మంది నామిని సభ్యులు వివిధ ప్రాంతాల్లో పోలింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బిఎన్‌పి నేత రుహుల్ కబిర్ రిజ్వీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తం గా అవామి లీగ్ పార్టీ పోలింగ్ బూత్‌ల ఆక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. చాలాప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలే హింసాత్మక సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికలను తమ పార్టీ అధికార అవామి లీగ్‌కు అనుకూలంగా,ఏకపక్షంగా జరిగిన ఎన్నికలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగలేదని.. అధికార పక్షాన్ని ఎలాగైనా పవర్‌లోకి తేవాలనే ఉద్దేశ్యంతోనే ఎన్నికలు జరిగినట్లు ఉందని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ఎన్నికలు హింసాత్మకం
RELATED ARTICLES