చివరి వన్డేలో వెస్టిండీస్‌పై
ఘన విజయం
ఢాకా: వెస్టిండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 8 వికెట్లతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న బంగ్లాదేశ్, తాజాగా వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి, మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌లో ఓపెనర్ షై హోప్ మరోసారి అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న షైహోప్ మాత్రం మరో ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధించాడు. రెండో వన్డే లాగనే ఈ వన్డేలో కూడా ఒంటరి పోరాటం చేస్తూ విండీస్‌ను ఆదుకున్నాడు. చివరి వరకు అజేయంగా ఉన్న షై హోప్ (108 నాటౌట్; 131 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్)తో మరో చిరస్మరాణియ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఇతర బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమవ్వడంతో విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకవైపు హోప్ సెంచరీతో సత్తా చాటుకుంటే మరోవైపు ఇతర బ్యాట్స్‌మెన్స్‌లో ఎవ్వరు కూడా 20 పరుగుల మార్కును దాటకపోవడం గమానర్హం. బంగ్లా బౌలర్లలో చెలరేగి బౌలింగ్ చేసిన మెహదీ హసన్ 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో సాకిబుల్ హసన్, ముర్తజా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ లిటన్ దాస్ (33 బంతుల్లో 5 ఫోర్లతో 23) పరుగులు చేసి కీమో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం సౌమ్య సర్కార్, మరో ఓపెనర్ లిటన్ దాస్ బంగ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును విజయం దిశలో పరిగెత్తించారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ 126 బంతుల్లో 100 పరుగుల మార్కును దాటింది. ఒకవైపు తమీమ్ స్లోగా ఆడుతుంటే మరోవైపు సౌమ్యసర్కార్ వేగంగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈక్రమంలోనే వీరిద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. చివర్లో ధాటిగా ఆడుతున్న సౌమ్య సర్కార్ 81 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి కీమో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా ఔటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. తర్వాత మిగిలిన స్వల్ప లక్ష్యాన్ని ముస్తాఫికుర్ రహీం (14 బంతుల్లో 16 పరుగులు)తో కలిసి తమీమ్ పూర్తి చేశాడు. చివరి వరకు అజేయంగా ఉన్న తమీమ్ ఇక్బాల్ 104 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలర్లో కీమోకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాచ్‌లో బౌల్‌తో మెరిసిన మెహదీ హసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవర్డు లభించింది. మరోవైపు సిరీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 17న తొలి టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది.