టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్
వరంగల్ బ్యూరో: బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం అని మాజీ క్రికెటర్, టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. ఆదివారం వరంగల్‌లోని పాపయ్యపేట చెమన్, మండిబజార్, చార్‌బౌలీ, కాశిబుగ్గ, తిలక్‌రోడ్డు వ రకు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర కు ప్రచారంలో మద్దతుగా ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ప్రజల బతుకులు మారలేదని, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఎక్కడ? నీళ్లు నియామకాల హామీలు ఏమైనవి? మైనార్టీ సోదరులకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, రైతు రుణమాఫీల హామీలను కెసిఆర్ ప్రభుత్వం గాలిలో కలపడాన్ని ప్రశ్నించారు. వద్దిరాజు రవిచంద్రను తూర్పు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలని కోరారు.
బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం
RELATED ARTICLES