హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ మాజీ స్టార్ గుత్తా జ్వాల న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. గురువారం జ్వాల తన బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించింది. ఈ సందర్భంగా గుత్తా జ్వాల మీడియాతో మాట్లాడింది. ఓ విలేకరి న్యూఇయర్ ఫోటోల గురించి జ్వాలను ప్రశ్నించగా.. ఫోటోల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అకాడమీ గురించి చర్చిద్దాం అని బదులిచ్చింది. ’ఈ అకాడమీని సుమారు రూ. 14 కోట్లతో నిర్మించాం. ఇది కూడా అతి పెద్ద అకాడమీనే. కేవలం బ్యాడ్మింటన్‌కే కాకుండా మిగతా స్పోరట్స్‌కు కూడా ఈ అకాడమీ సేవలందిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా అకాడమీలను నిర్మించే అవకాశం వస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తా’ అని జ్వాల చెప్పుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైస్కూల్ ప్రాంగణంలో జ్వాల అకాడమీని ఏర్పాటు చేసింది. ’జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తో పాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు.భవిష్యత్తులో మరికొన్ని క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందించనున్నారు. విష్ణు విశాల్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా జ్వాల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మాట్లాడాడు. ’జ్వాల గుత్తా అకాడమీ నుంచి ఓ గు్‌డ న్యూస్. ఇది ప్రొఫెషనల్ ఆటగాళ్లు, బ్యాడ్మింటన్ ఆడాలనుకునేవారికి ఒక మంచి అవకాశం. చాలా పెద్ద అకాడమీ ఇది. 14 కోర్టులు ఉన్నాయి. అకాడమీ నిర్మాణంను మొదటి నుండి చూస్తున్నా. చాలా బాగుంది. ప్రపంచంలోని బెస్ట్ కోచ్‌లతో శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా మంది ఛాంపియన్స్ బయటకురావాలి. ఆల్ ది బెస్ట్ జ్వాల’ అని చెప్పుకొచ్చాడు.
ఫొటోల గురించి వదిలేసి.. అడామీ గురించి మాట్లాడండి: గుత్తా జ్వాలా
RELATED ARTICLES