సెమీస్‌లో ఇంతనోన్‌పై విజయం
వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ
గ్వాంగ్జౌ (చైనా): భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ పివి. సింధు వరుసగా రెండో సారి వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో దూసుకెళ్లింది. ఈ టో ర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న సింధు సె మీస్లో థాయ్‌లాండ్ ప్రత్యర్థిని చిత్తు చేసి తుది పోరుకు సిద్ధమైంది. మరోవైపు పురుషుల విభాగం సింగిల్స్‌లో సమీర్ వర్మ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. చైనా ప్రత్యర్థి చేతి లో సమీర్ వర్మ ఓటమిపాలయ్యాడు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పివి సింధు 21 -25 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్ థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతనోన్ రచనోక్‌ను చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించిం ది. ఈ మ్యాచ్‌ను సింధు 54 నిమిషాల్లోనే ముగించేసింది. ఆ రంభంనుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆ ధిపత్యం చెలాయిస్తూ తొలి గేమ్‌ను 21- సునాయాసం గా గెలుచుకుంది. తర్వాతి గేమ్‌లో మాత్రం పుంజుకున్న థాయ్ ప్రత్యర్థి సింధుపై ఎదురుదాడికి దిగింది. నువ్వా.. నేనా.. అన్నట్టు సాగిన ఈ గేమ్‌లో ఇద్దరూ గొప్పగా పోరాడారు. హోరాహోరీ పోరులో చివరి వరకు సింధు అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వరుసగా పాయింట్లు సాధించింది. మరోవైపు మాజీ వరల్డ్ చాంపియన్ తానుకూడా తక్కువేమి కాదని నిరూపిస్తూ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. దీంతో ఇద్దరి మధ్య ఈ గేమ్ ఉత్కంఠభరితంగా సాగి టై బ్రేకర్‌కు దారి తీసింది. చివరివరకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గొప్పగా పోరాడిన సింధు 25- గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలువని సిం ధుకు ఇది గొప్ప అవకాశం. వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న సింధు ఈ సీజన్ మొదటి టైటిల్‌ను ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కానీ, ప్రతిసారి ఫైనల్స్‌లో ఈజీగా ప్రవేశించే సింధు ఫైనల్స్‌లో మాత్రం తడబడుతూ ఓటములను చవిచూస్తోంది. ఈ ఏడాది ముగిసిన పెద్ద టోర్నీల్లో సింధు ఫైనల్స్ వరకు ప్రవేశించినా స్వర్ణం మాత్రం గెలువలేకపోయింది. రియో ఒలింపిక్స్, జకార్త ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్లో అడుగుపెట్టినా టైటిల్ నెగ్గలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ, అయితే ఈ సారి చివరి అవకాశంగా తనముందున్న వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో టైటిల్ సాధించే 2018 సీజన్‌కు వీడ్కోలు పలుకుతాననే దృఢ సంకల్పంతో ఉన్నట్టు సింధు తెలిపింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో సింధు జపాన్ సంచలనం నొజొమి ఒకుహారాతో తలపడనుంది.
ఫైనల్లో దూసుకెళ్లిన సింధు
RELATED ARTICLES