దేశ ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడవద్దని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పష్టం చేశారు. ఎల్‌ఎసి వద్ద యథాతథ పూర్వస్థితిని కొనసాగించేందుకు కృషి చేయాలని కోరారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ సన్నిహిత బాంధవ్యం ఈ సమస్య పరిష్కారానికి దోహదం చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భద్రత, విదేశాంగ విధానం విషయంలో యావద్దేశ ప్రజల ఏకాభిప్రాయం మేరకే ప్రభుత్వం తమ తీరును అవలంబించాలని సూ చించారు. అలాగే ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అది చైనా అయినా, ఇంకే దేశమైనా… దేశ ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడవద్దని డి.రాజా స్పష్టం చేశారు. ఎల్‌ఎసి వద్ద ఏప్రిల్‌కు ముందు ఉన్న పరిస్థితిని పునరుద్దరించాలని కోరారు. అలా గే నేపాల్ వంటి ఇరుగుపొరుగు దేశాలతో శత్రు త్వం పెరగకుండా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో సంభవించిన లోపాలపై ఆనాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి దర్యాప్తు నిర్వహించారని, అలాగే ఇప్పుడు గల్వన్‌లో జరిగిన ఘటన విషయంలో నిఘా వర్గాలు, ప్రభుత్వ వైఫల్యంపై తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నాటి కార్గిల్ కమిటీ (కె.సుబ్రమణ్యస్వామి అధ్యక్షతన కమిటీ) విచారణ జరిపి మంచి సూచనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిఘా వైఫల్యం కారణంగా విలువైన సైనికుల ప్రాణాలను కాపాడలేకపోయామని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రాదేశిక సమగ్రతపై రాజీపడొద్దు
RELATED ARTICLES