ప్రజాపక్షం/హైదరాబాద్; తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడైన 24 గంటల్లోనే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోఠిలోని ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న గాంధీనగర్‌కు చెందిన అనామిక గురువారం వెల్లడించిన పరీక్ష ఫలితాల్లో సెకండియర్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే బాటలో మరికొందరు విద్యార్థుల్లో కొందరు రైలు కింద పడి, మరికొందరు విషం సేవించి ఇలా రకరకాలుగా ఆత్మహత్యకు తెగపడ్డారు. పరీక్ష సరిగా రాయలేదనే మనస్తాపంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నవ్యశ్రీ అదే రోజు ఆత్మ హత్యకు పాల్పడింది. గురువారం వెల్లడైన పరీక్షా ఫలితాల్లో నవ్యశ్రీ పాస్ కావడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. విద్యార్థుల ఆత్మహత్యలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వైఫల్యమే కారణమని మానిసిక నిపుణులు అంటు న్నారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు పలు కుంటుబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఫలి తాలు విదులైన అనంతరం మనస్తాపానికి గురై పిల్లల్లా రాలిపోతున్నారు. మరోసారి పరీక్షలు రాసే అవకాశాలు ఉన్నా..ఆలోచించకుండా క్షణి కావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదం డ్రులు తిడతారని.. స్నేహితుల వద్ద తలెత్తు కోలేమని.. సమాజంలో పరువుపోతుంది.. ఇలా ఏదో కారణంతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్య ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని మానసిక వైద్య నిపుణులు అభి ప్రాయపడుతున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్ కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అవగాహనలేమితో ఇవేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు ప్రాణాలు తీసుకుం టున్నారు. కన్నవారి కడుపుకోత మిగల్చుతు న్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భావి పౌరులు జీవితం మధ్య లోనే తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణలో ఇంటర్ ఫలి తాలు గురువారం సాయంత్రం విదులైన విషయం తెలిసిందే.
ప్రాణాలు తీసిన ఇంటర్ ఫలితాలు ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య
RELATED ARTICLES