చలి కాచుకుంటుండగా ఊపిరి ఆడక తల్లి, కుమారుడు మృతి
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హృదయ విదారక ఘటన
ప్రజాపక్షం/ పంజాగుట్ట : చలి కాచుకునేందుకు ఏర్పాటు చేసిన బొగ్గు ల కుంపటి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం తూర్పు గోదావరి పిఠాపురం మండలా నికి చెందిన సత్యబాబు, బుచ్చివేణి దంపతు లు నగరానికి బ్రతుకు దెరువు నిమిత్తం వచ్చి జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 25 ఫ్లాట్ నెంబర్ 306లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసు కున్న పెను మార్పుల కారణంగా గత మూడు రోజులుగా వీస్తుడడంతో మంగళ వారం రాత్రి బుచ్చివేణి తన కుమారుడు పద్మారాజుతో కలసి ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. వేడి బయటకు పోకుండా ఉండేందుకు ఇంటి తలుపులు, కిటికిలు మూసివేశారు. వారు గాఢ నిద్రలోకి చేరుకున్న అనంతరం ఒక్కసారిగా బొగ్గుల కుంపటినుంచి పొగ కమ్ముకోవడంతో ఉపిరి ఆడక తల్లి బుచ్చివేణి, పద్మరాజులు చనిపోయారు. ఇంటికి వచ్చిన సత్యబాబు తలుపు తెరిచి చూడగా ఇద్దరు విగతజీవులుగాపడి ఉన్నారు. విషయాన్ని పోలీసులకు తెల పడటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను గాంధీకి తరలించారు.