రవిశాస్త్రి సూచనలతో సాధన చేసిన టీమిండియా
సౌతాఫ్రికాతో టెస్టులకు సన్నద్ధం
గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం
వైజాగ్: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకున్న భారత జట్టుకు చివరి టీ20లో గెలిచి దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. దీంతో టీ20 సిరీస్ 1-1తో సమం అయింది. అయితే భారత్ మరో సమరానికి సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 2 నుండి విశాఖలో జరగనుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లుఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ఆదివారమే విశాఖ చేరుకున్నారు. కోహ్లీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గత వారమే దక్షిణాఫ్రికా జట్టు విశాఖకు చేరుకుని సన్నాహక మ్యాచ్ ఆడారు. ఆదివారం రెస్ట్ తీసుకున్న ఆటగాళ్లు సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. హెడ్‌కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. రవిశాస్త్రి దగ్గరుండి మరి వీరి బౌలింగ్‌ను గమనించాడు. స్పిన్నర్ అశ్విన్ కూడా బౌలింగ్ చేసాడు.
చెమటోడ్డిన కోహ్లీ..
మరోవైపు విరాట్ కోహ్లీ, అంజిక్య రహానే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్‌కు ముందు హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల అందరితో సమావేశం అయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ప్రాక్టీస్.. ప్రాక్టీస్..
RELATED ARTICLES