ఇవ్వాల్సిన కట్టుబాటు రాష్ట్రప్రభుత్వాలకు లేదు!
స్పష్టీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించాల్సిన విధి రాష్ట్రప్రభుత్వాలకు లేదు, ప్రమోషన్లలో కోటా కోరడం కూడా ప్రాథమిక హక్కేమి కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ‘సుప్రీంకోర్టు రూపొందించిన చట్టం ప్రకా రం రిజర్వేషన్లు కల్పించాల్సిన విధి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లను కోరడం ప్రాథమిక హక్కు కాదు’ అని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ ఆదేశిస్తూ రాష్ట్రప్రభుత్వాలకు ఉత్తర్వు(మాండేమస్)ను ఇవ్వలేము’ అని కూడా ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభు త్వం పబ్లిక్ సర్వీసెస్‌లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్‌లకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించకుండానే భర్తీచేయాలని 2012 సెప్టెంబర్ 5న నిర్ణయించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టులో సవాలుచేసినప్పుడు ఆ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దాంతో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీళ్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు విచారించింది. ‘పబ్లిక్ పోస్ట్‌లలో రిజర్వేషన్ల ద్వారా నియామకాలు జరపాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించకూడదన్న చట్టం ఉంది. అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో కూడా ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అగత్యం కూడా ప్రభుత్వానికి లేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘అయితే…ఒకవేళ రాష్ట్రప్రభుత్వాలు రిజర్వేషన్ల వెసలుబాటు కల్పించాలనుకుంటే చేయొచ్చునని, అందుకు పబ్లిక్ సర్వీసెస్‌లో ఆ వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం లభించడంలేదన్న సమర్థనీయ సమాచారం (క్వాన్టిఫియేబుల్ డేటా) రాష్ట్రప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది’ అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 2012 సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్ తీసుకున్న నిర్ణయాన్ని అప్హోల్డ్ చేస్తూనే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన కట్టుబాటు ప్రభుత్వానికి లేదని కూడా ధర్మాసనం తెలిపింది. కాగా ఉత్తరాఖండ్ హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని అక్రమం అని పేర్కొనలేదన్నది ఇక్కడ గమనార్హం. రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రస్తావిస్తూ ‘పబ్లిక్ పోస్టుల్లో నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అనేది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుంది’ అని పేర్కొంది. ‘రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాల్లో ఎస్సి, ఎస్టిలకు తగినంత ప్రాతినిధ్యం లేదనుకున్న సందర్భాల్లో …ఒకవేళ రాష్ట్రప్రభుత్వ కోరుకుంటే, రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తెలిపింది. అందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4), 16(4 అధికారాన్ని ఇస్తున్నాయని స్పష్టంచేసింది.
ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు
RELATED ARTICLES