HomeNewsTelanganaప్రతి వ్యక్తికీ ప్రభుత్వ ఫలాలు ఆ దిశగా బడ్జెట్‌ ఉండాలి

ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ ఫలాలు ఆ దిశగా బడ్జెట్‌ ఉండాలి

గత ప్రభుత్వం అనేకమంది జీతాలు వాడుకున్నది
అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లిస్తున్న పూర్తి వేతనాలు అందడం లేదు
అసెంబ్లీలో సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ వ్యక్తి కేంద్రంగా బడ్జెట్‌ తయారు చేయాలని, చివరలో ఉన్న ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ ఫలాలు అందేలా బడ్జెట్‌ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు సూచించారు. తెలంగాణ తలసారి ఆదాయంలో 6 శాతం ఉన్నప్పుడు, 18వ స్థానంలో ఉన్న పేదరికాన్ని ఎందుకు తగ్గించలేకపోయారని బిఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. పేదోడీ రూపాయి, సంపన్నుల లక్ష కలిపి తలసరి ఆదాయం లెక్కలు తీస్తారని, ఈ లెక్కలే అశాస్త్రీయమన్నారు. శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై బుధవారం జరిగిన చర్చలో కూనంనేని సాంబశివ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వ ఉద్యోగి తరహా అసంఘటితంగా, కార్మికులకు పిఎఫ్‌ ద్వారా డబ్బులు వచ్చేలా చూడాలని, ఇందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలను సహకారం తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ వర్కర్లు, పోలీసులు, హోమ్‌గార్డలు ఇలా అనేక మంది జీతాలను కూడా వాడుకున్నదని, ఇదంతా పెద్ద భారమే అయినప్పటికీ బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లిస్తున్న పూర్తి వేతనాలు అందడం లేదని, ఏజెన్సీలకు కొంత వెళ్తున్నాయని, పేదలకు ఇచ్చే వేతనాలే తక్కవ అని, అందులోనూ కోతలు పెడుతున్నారని విమర్శించారు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించడం ద్వారా వారికి పూర్తి స్థాయి వేతనాలు అందుతాయన్నారు. పేదలకు సబ్సిడీ, ఏదైనా సహాయం చేస్తే దీనిని ప్రధాని నుండి, కొందరు బాగా మేధావులు అనుకునే వారు ‘రేవిడి కల్చర్‌’ (ఉచితాలు) అని ఎద్దేవా చేస్తారని, పేదలను పెంచి పోషిస్తున్నారని, రాష్ట్రం దివాళ తీయిస్తున్నారని చెబుతున్నారని చెప్పారు. జిఎస్‌టిలో పేద,మధ్య, దిగువ మధ్య తరగతి చెల్లించే వాటా రూ.18లక్షల కోట్లు ఉంటే ఇందులో మూడు శాతం మాత్రమే సంపన్నులు చెల్లిస్తున్నారని, ప్రతిఏటా పెద్ద పెద్ద కంపెనీలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తున్నారన్నారు. ఇటీవల దావోస్‌కు వెళ్లి రాష్ట్రానికి రూ.40వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని, ఈ అంశంలో ఆయా కంపెనీలు విషమ నిబంధనలు పెడుతారని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు.
పెద్ద పెద్ద సంపన్నులకూ పన్ను విధించండి పెద్ద పెద్ద సంపన్నులపైన సంపన్నుల పన్ను విధించాలని, కొన్ని దేశాల్లో ఈ విధానం అమలులో ఉన్నదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రం మిగులు రెవెన్యూ ఉన్నందున ధనిక రాష్ట్రమని గత ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య తనతో చెప్పారని, ఈ లెక్కలే అశాస్త్రీయమన్నారు. కేంద్రపన్నులో వాటా, సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు అని, అన్ని కలిపితే రెవెన్యూ ఆదాయం అని, ఖర్చుల కింద ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలు, అసలు చెల్లింపులు వస్తాయని, ఇందులో ఏదీ తగ్గించినా రెవెన్యూ మిగులుతుందని, సర్‌ప్లస్‌ చూపించవచ్చునని, దీని ఆధారంగా ధనిక రాష్ట్రంగా చూపించవచ్చునన్నారు. ప్రతి చివరి మనిషికి, పేదవాడికీ బడ్జెట్‌లోని ఫలాలు అందే లెక్కల ఆధారంగానే ధనిక, పేద రాష్ట్రంగా అర్థమవుతుందన్నారు. దేశం, తెలంగాణ, హైదరాబాద్‌లో పేద, ధనిక రెండూ ఉన్నాయన్నారు. నాడు నిజాంనవాబు కాలంలో ప్రపచంలోనే అత్యంత కుబేరుడు అని, అప్పుడు వెట్టిబానీసలు ఉన్నారని, అందుకే తెలంగాణ సాయుధపోరాటం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కొత్త రకం నిజాంలు, మాఫీయాలు, జమీందార్లు, జాగీర్‌దారులు అంతా మాఫియాల మయం అయ్యాయని, ఆస్తులన్నీ వారి వద్దనే ఉన్నాయని, పేదరికంలో మాత్రం ఎటువంటి మార్పు లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సిఎం వైఎస్‌ఆర్‌ రేషన్‌కార్డుల నుండి అన్నీ సాచురేషన్‌ వరకు తీసుకెళ్లారని, మనసు ఉండి, ధృడసంకల్పం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉండి,గత ప్రభుత్వ వైఫల్యాలను నేర్చుకుంటే, కచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేయవచ్చునని తెలిపారు. రైతుబంధుకు పరిమితి పెట్టాలని, వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు మినహాయిస్తే, రూ.నాలుగైదు వేల కోట్లు మిగులుతాయని ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో అక్రమంగా భూములు స్వాధీనంపై ఒక కమిటీ వేసి, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. అసంఘటిత, వ్యవసాయ రంగంలో ఉన్న పేదలను ఎలా ఆదుకోవాలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచే చేయాలన్నారు.
ఏడాది వరకు విమర్శించే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు
రాష్ట్ర ప్రభుత్వంపైన ఒక సంవత్సరం వరకు విమర్శించే హక్కు ప్రధాన ప్రతిపక్షానికి లేదని కూనంనేని సూచించారు. ప్రజలు అమాయకులు కాదని, ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలల ఏడు రోజులు అయిందని, బడ్జెట్‌ పెట్టాలా? వద్దా? బడ్జెట్‌ పెట్టకపోతే జీతభత్యాలు ఉంటాయా? ముందుకు వెళ్తుందా? బడ్జెట్‌ పెట్టి, తమ వద్ద ఏమీ లేదని చెప్పాలా? ప్రభుత్వం ఏం చేయాలి అని అన్నారు.
నువ్వు చస్తే..నేను ఆ కుర్చీలో కూర్చుంటా…
“నిన్న నువ్వు గెలిచావు కాబట్టి…తొందరగా చావాలి.. నువ్వు చస్తే, నేను ఆ కుర్చీలో కూర్చుంటాను” అనే ఆలోచనలు చేయకూడదని కూనంనేనిసాంబశివరావు సూచించారు. ‘మీరు’ (బిఆర్‌ఎస్‌) అప్పులు చేసి, ఈ అప్పుల నుండి మీరు (కాంగ్రెస్‌ ప్రభుత్వం) ఎలా భయడపడుతారో చూస్తాం.. ఇదా చెప్పాల్సిన సలహా..మీరు వ్యవస్థలను విధ్వంసం చేస్తారని, దీనిని ఎలా బాగు చేస్తారో చూస్తామనే ఇదేంపద్దతి, ఇది న్యాయం కాదని హితువుపలికారు .అసహానంతో ఎక్కువ మాట్లాడినా, శాపనార్థాలు పెట్టినా అవి మన ఒంటికి, మనకు, సమాజానికి మంచిది కాదన్నారు. సదుద్దేశం లేనివారు శాపనార్థాలు పెడితే ప్రజలు మళ్లీ మంచి తీర్పు ఇస్తారన్నారు. ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు.
మేడిగడ్డకు వెళ్లడం నేరమా..?
మేడిగడ్డకు వెళ్తే తప్పు ఏముందని కూనంనేని సాంబశివరావు బిఆర్‌ఎస్‌ నేతలను కూనంనేని నిలదీశారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌దెబ్బతింటే ఆ ప్రాజెక్ట్‌ను చూసిరావడం నేరమా? అని ప్రశ్నించారు. వెళ్లిన వారిని తిట్టడం న్యాయమా? పెద్ద స్థాయిలో ఉన్న వారు అన్‌పార్లమెంటరీ పదాలతో తిట్టడం గౌరవం కాదని, ఇది వారికి, తమకు తెలంగాణ సమాజానికి అంతకంటే మంచిది కాదని కెసిఆర్‌ను ఉద్దేశించి హితువు పలికారు. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరమే లేదన్నారు. కాంగ్రెస్‌, సిపిఐ మాట్లాడిన అంశాలు కాకుండా మేడిగడ్డకు వచ్చిన పాత్రికేయులతో ప్రైవేటుగా మాట్లాడితే వాస్తవాలు చెబుతారని బిఆర్‌ఎస్‌ నేతలకు కూనంనేని సూచించారు. అప్పులు చేసి కాళేశ్వరం లాంటి ఆస్తులను కూడగట్టారా? అని నిలదీశారు. కాళేశ్వరం వ్యక్తిగతమా? రాష్ట్రానికి ఉపయోగమా?, పేదలు కట్టిన సిస్థులు, మన పేరుతో చేసిన అప్పులన్నీ కాళేశ్వరంపైన పెట్టారన్నారు. కాళేశ్వరంలో జరిగిన పగుళ్లు తెలంగాణ ప్రజల గుండె పగుళ్లు అని పునరుద్ఘాటించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments