వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సాగుదారులకు ఊతమిచ్చిన పోడుయాత్ర
అడవి బిడ్డల సహజ హక్కుల పరిరక్షణకు అండ
యాత్ర పొడవునా ఆత్మీయ స్వాగతం& సమస్యలపై వినతి పత్రాల వెల్లువ
సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని సిపిఐ ప్రతినిధి బృందం హామీ
ఐదు రోజుల పాటు ఏడు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో జరిగిన యాత్ర
ప్రజాపక్షం న్యూస్ నెట్వర్క్ : భూమి హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న పోడు రైతులకు ‘సిపిఐ పోడు యాత్ర’ భరోసానిచ్చింది. నిత్యం చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తున్న అటవీ, రెవెన్యూ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు పోడు సాగుదారులకు పోడుయాత్ర ఊతమిచ్చింది. అడవి బిడ్డల సహజ హక్కుల పరిరక్షణకు అండగా నిలిచింది. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంపై ఆధారపడిన ఆదివాసీ, గిరిజన రైతుల బతుకులు ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమాయకులైన గిరిజనులు, ఆదివాసీల జోలికి వస్తే సహించేదిలేదని పోడుయాత్ర స్పష్టం చేసింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం అడవి బిడ్డలకు, పోడు రైతులకు భూ హక్కులు కల్పించి వారికి రైతు బంధు, రైతు బీమా వర్తింప చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. పోడు రైతులపై జరుగుతున్న దాడులు దారుణమని, అమాయక అడవి బిడ్డలను వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులపై అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటామని సిపిఐ హామీ ఇచ్చింది. పోడు భూముల పరిరక్షణ, పోడు సాగుదారుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 4వ తేదీన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్‌లో ప్రారంభమైన ‘సిపిఐ పోడుయాత్ర’ ఐదు రోజుల పాటు ఏడు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో కొనసాగి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దుమ్ముగూడెంలో ముగిసింది. ఈ యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకోండ కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరింహ కళా బృందం పాల్గొన్నారు. కాగా సాగిన జిల్లాలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. యాత్ర పొడవునా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం లభించింది. తమ కోసం వచ్చిన సిపిఐ నాయకులను గిరిజనులు, ఆదివాసీలు అక్కున చేర్చుకుని అన్నం పెట్టారు. సమస్యలపై పోడు రైతులు వినతి పత్రాలు వెల్లువెత్తాయి. పోడు రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని సిపిఐ ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. ‘మా కోసం చేస్తున్న పోరాటంలో మేమూ మీతోనే ఉంటాం’ అని పోడుసాగుదారులు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన పోడు యాత్ర నాయకుల బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పోడు యాత్రకు ప్రతి మండలంలోనూ జనం డప్పు దళాలతో ఎదురొచ్చి పార్టీ ఉద్యమ కార్యాచరణకు అండగా నిలబడతామని డప్పు కొట్టి మరీ చెప్పారు. ఖమ్మం నుంచి కోదుమూరు, తిమ్మారావుపేట వరకు జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పెద్దఎత్తున యువకులు పాల్గొనడం గమనార్హం. పోడు యాత్రలో భాగంగా గిరిజన ప్రాంతాలలో ఆరుగాలం కష్టపడి పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల చేతికి వచ్చిన పంటలను అటవీ, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేస్తున్న తీరును చూసిన సిపిఐ నేతల కళ్లు చెమర్చాయి. పంటలను నాశనం చేసిన తీరును వివరిస్తూ కన్నీటిపర్యంతమైన సాగుదారులను నాయకులు ఓదార్చారు. పోడుయాత్ర పోడు వ్యవసాయం అధికంగా ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగుడెంతో పాటు 24 జిల్లాల్లో నెలకొన్న పోడు రైతుల సమస్యలకు పరిష్కారం కోసం యాత్రను నిర్వహించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పోడు రైతులు ఇచ్చిన వందలాది విజ్ఞాపన పత్రాలలోని సమస్యలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు తెలియజేసి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సిపిఐ ప్రతినిధి బృందం రైతులకు తెలియజేసింది. యాత్ర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల, గిరిజనులపై నిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక చోట లాఠీలు ఝళిపిస్తున్న తీరును ఎండగట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో ఆదివాసి గిరిజనుల తరుపున పోరాటం చెసిన సిపిఐ నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన ఘనత తెలంగాణ నిరంకుశ ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోడు భూములకు పట్టాలు ఇస్తానని టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చడమేకాకుండా ప్రభుత్వం రెండోసారి గెలవగానే ఆదివాసి ప్రాంతాల్లో కుర్చి వేసుకుని కూర్చుని మరీ పోడురైతుల సమస్యలను పరిష్కరిస్తాననిహామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పోడు రైతుకు కూడా పట్టా ఎందుకు ఇవ్వలేదని సిపిఐ ప్రశ్నించింది. సిపిఐ, సిపిఐ(ఎం) ల విజ్ఞప్తి మేరకు పోడుసాగుదారుల హక్కుల అంశం 2005లో అప్పటి కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సిఎంపి)లో పొందుపర్చిందని, 2006లో చట్టం అయిన అనంతరం రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న 8 లక్షల మంది రైతులలో 3.68 లక్షల మందికి హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి నుండి పోడు చేసుకుంటున్న గిరిజనులకు ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ పట్టాలు ఇవ్వలేదని నేతలు గుర్తు చేశారు. “భూములు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చుడు కంటే గుంజుకొనుడు ఎక్కువైంది. పోడు రైతులను భూముల నుంచి వెళ్లగొట్టేందుకు ఈ ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం” అని పోడు యాత్ర ముగింపు సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కల్పించి వారికి రైతు బంధు, రైతు బీమా వర్తింప చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. పోడు రైతులపై జరుగుతున్న దాడులు దారుణమని, అమాయక అడవి బిడ్డలను వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులపై అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటామని సిపిఐ హామీ ఇచ్చింది. పోడు భూముల పరిరక్షణ, పోడు సాగుదారుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 4వ తేదీన కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్‌లో ప్రారంభమైన ‘సిపిఐ పోడుయాత్ర’ ఐదు రోజుల పాటు ఏడు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో కొనసాగి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దుమ్ముగూడెంలో ముగిసింది. ఈ యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకోండ కాంతయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరింహ కళా బృందం పాల్గొన్నారు. కాగా సాగిన జిల్లాలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. యాత్ర పొడవునా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం లభించింది. తమ కోసం వచ్చిన సిపిఐ నాయకులను గిరిజనులు, ఆదివాసీలు అక్కున చేర్చుకుని అన్నం పెట్టారు. సమస్యలపై పోడు రైతులు వినతి పత్రాలు వెల్లువెత్తాయి. పోడు రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని సిపిఐ ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది. ‘మా కోసం చేస్తున్న పోరాటంలో మేమూ మీతోనే ఉంటాం’ అని పోడుసాగుదారులు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన పోడు యాత్ర నాయకుల బృందానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పోడు యాత్రకు ప్రతి మండలంలోనూ జనం డప్పు దళాలతో ఎదురొచ్చి పార్టీ ఉద్యమ కార్యాచరణకు అండగా నిలబడతామని డప్పు కొట్టి మరీ చెప్పారు. ఖమ్మం నుంచి కోదుమూరు, తిమ్మారావుపేట వరకు జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పెద్దఎత్తున యువకులు పాల్గొనడం గమనార్హం. పోడు యాత్రలో భాగంగా గిరిజన ప్రాంతాలలో ఆరుగాలం కష్టపడి పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల చేతికి వచ్చిన పంటలను అటవీ, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేస్తున్న తీరును చూసిన సిపిఐ నేతల కళ్లు చెమర్చాయి. పంటలను నాశనం చేసిన తీరును వివరిస్తూ కన్నీటిపర్యంతమైన సాగుదారులను నాయకులు ఓదార్చారు. పోడుయాత్ర పోడు వ్యవసాయం అధికంగా ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగుడెంతో పాటు 24 జిల్లాల్లో నెలకొన్న పోడు రైతుల సమస్యలకు పరిష్కారం కోసం యాత్రను నిర్వహించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పోడు రైతులు ఇచ్చిన వందలాది విజ్ఞాపన పత్రాలలోని సమస్యలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు తెలియజేసి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సిపిఐ ప్రతినిధి బృందం రైతులకు తెలియజేసింది. యాత్ర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల, గిరిజనులపై నిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక చోట లాఠీలు ఝళిపిస్తున్న తీరును ఎండగట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో ఆదివాసి గిరిజనుల తరుపున పోరాటం చెసిన సిపిఐ నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన ఘనత తెలంగాణ నిరంకుశ ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోడు భూములకు పట్టాలు ఇస్తానని టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చడమేకాకుండా ప్రభుత్వం రెండోసారి గెలవగానే ఆదివాసి ప్రాంతాల్లో కుర్చి వేసుకుని కూర్చుని మరీ పోడురైతుల సమస్యలను పరిష్కరిస్తాననిహామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పోడు రైతుకు కూడా పట్టా ఎందుకు ఇవ్వలేదని సిపిఐ ప్రశ్నించింది. సిపిఐ, సిపిఐ(ఎం) ల విజ్ఞప్తి మేరకు పోడుసాగుదారుల హక్కుల అంశం 2005లో అప్పటి కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సిఎంపి)లో పొందుపర్చిందని, 2006లో చట్టం అయిన అనంతరం రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న 8 లక్షల మంది రైతులలో 3.68 లక్షల మందికి హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పటి నుండి పోడు చేసుకుంటున్న గిరిజనులకు ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ పట్టాలు ఇవ్వలేదని నేతలు గుర్తు చేశారు. “భూములు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చుడు కంటే గుంజుకొనుడు ఎక్కువైంది. పోడు రైతులను భూముల నుంచి వెళ్లగొట్టేందుకు ఈ ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ కుట్రలను సాగనివ్వం” అని పోడు యాత్ర ముగింపు సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోడురైతులకు సిపిఐ భరోసా
RELATED ARTICLES