పొట్టకొడుతున్నారు!

భద్రాద్రి జిల్లాలో పోడు రైతుల ఆవేదన
భూముల్లో కందకాలు తవ్వేందుకు వచ్చిన అధికారుల అడ్డగింత
పోడు రైతులు, అధికారుల మధ్య తోపులాట
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పోడు రైతు
ప్రజాపక్షం / లక్ష్మీదేవిపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మం డలం పునుకుడుచెలక గ్రామపంచాయతీలో గత ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ గిరిజనులు సాగుచేసుకుంటు న్న పోడు భూముల్లో బుధవారం కందకాలు తవ్వేందుకు పొక్లున్‌తో వచ్చిన అటవీ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్నేళ్లుగా పునుకుడు చెలక గ్రామపంచాయతీలో గల సుమారు 400 ఎకరాలలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీల పొట్టకొడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోక్లున్‌ ముందుకు కదలనీయకుండా రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు, పోడు రైతులకు మధ్య తోపులాట జరిగింది. మహిళ అని కూడా చూడకుండా అధికారులు సర్పంచ్‌ పాయం కాంతమ్మపై దాడి చేశారని రైతులు వాపోయారు. తమకున్న రెండెకరాల భూమిని అధికారులు లాక్కుంటున్నారని ఆవేదనతో గుమ్మడి రామారావు అనే పోడు రైతు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అంజయ్య, సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. అటవీ అధికారులు తమకున్న కొద్దిపాటి భూమిని తీసుకుంటే తమ జీవనం ఎలా గడుస్తుందని, తనకున్న భూమిలో అటవీ అధికారులు ట్రెంచ్‌ కొడితే కుటుంబ సమేతంగా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి వెనుకాడబోనని రామారావు ఆవేదన వ్యక్తం చేశాడు.
పోడు రైతుల జోలికి వస్తే సహించేది లేదు
గత నలభై ఏళ్లుగా పునుకుడుచెలకలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జోలికి వస్తే సహించేది లేదని ఆదివాసీ జెఎసి నాయకుడు వాసం రామకృష్ణ దొర హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాలను పెడచెవిన పెట్టి బక్కచిక్కిన పేద రైతులపై అటవీ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారని, వెంటనే పోడు భూముల నుంచి ప్రొక్లున్‌ను వెనక్కు పంపాలని, ట్రెంచ్‌ పనులను నిలిపివేయాలని ఆయన అధికారులను డిమాండ్‌ చేశారు. మహిళా సర్పంచ్‌పై దాడిని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. పునుకుడుచెలక గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరందరికీ సర్వే నిర్వహించి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
యత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అంజయ్య, సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. అటవీ అధికారులు తమకున్న కొద్దిపాటి భూమిని తీసుకుంటే తమ జీవనం ఎలా గడుస్తుందని, తనకున్న భూమిలో అటవీ అధికారులు ట్రెంచ్‌ కొడితే కుటుంబ సమేతంగా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి వెనుకాడబోనని రామారావు ఆవేదన వ్యక్తం చేశాడు.
పోడు రైతుల జోలికి వస్తే సహించేది లేదు
గత నలభై ఏళ్లుగా పునుకుడుచెలకలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జోలికి వస్తే సహించేది లేదని ఆదివాసీ జెఎసి నాయకుడు వాసం రామకృష్ణ దొర హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాలను పెడచెవిన పెట్టి బక్కచిక్కిన పేద రైతులపై అటవీ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారని, వెంటనే పోడు భూముల నుంచి ప్రొక్లున్‌ను వెనక్కు పంపాలని, ట్రెంచ్‌ పనులను నిలిపివేయాలని ఆయన అధికారులను డిమాండ్‌ చేశారు. మహిళా సర్పంచ్‌పై దాడిని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. పునుకుడుచెలక గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరందరికీ సర్వే నిర్వహించి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?