మోడీ విధానాలపై నోబెల్ విజేత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ఆవేదన
న్యూఢిల్లీ: నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ భారత్‌లోని మోడీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఆంక్షల కాలంలో పేదలకు తోడ్పాటునిచ్చేందుకు వెచ్చించిన నిధులు తీవ్ర అసంతృప్తికరంగా వున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఒక విధం గా నిరుపేదల పట్ల ఇది చిన్నచూపుగానే పరిగణించాల్సి వుంటుందన్నారు. అభిజిత్ బెనర్జీ శుక్రవారంనాడు బిబిసికి ఇచ్చిన ప్రత్యేక ఇం టర్వ్యూలో మాట్లాడుతూ, వాస్తవానికి సం క్షేమ కార్యక్రమాల విస్తరణకు నిధులు వెచ్చించే విషయంలో భారత్ భయపడకూడదని, కానీ ఇప్పటివరకు కేంద్రం సంక్షేమ ప్యాకేజీ కింద దాదాపు రూ. 1.7 లక్షల కోట్లు ప్రకటించగా, అది దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 0.8 శాతం మాత్రమేనని అనన్నా రు. అట్టడుగు వర్గాలకు అదనపు ధాన్యం గింజలు, నగదును అందించడానికి ఈ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు. నిజానికి ఇవేమీ గొప్పగా కేటాయించిన నిధులేమీ కావ ని పేర్కొన్నారు. “ద్రవోల్బణం భయం ఉం డొచ్చు. వస్తువులు, సేవల సరఫరాల విషయంలో గొప్ప పురోగతి ఏమీ లేదు. పేద, సం పన్న వర్గాల నడుమ ఆదాయ అంతరాన్ని తగ్గించడానికి గట్టిగా కృషి చేసి వుండాల్సింది. కానీ అలాంటి ప్రయత్నమేదీ కన్పించడం లేదు. నిధులను వెచ్చించడంలో ప్రభుత్వం మరింత వేగంగా వుండాల్సిన అవసరం వుంది. భారతీయ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీకి 2019లో ఆర్థికరంగంలో నోబెల్ బహుమతి సిద్ధించింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే క్రమంలో పేదలకు నగదు బదిలీ ప్రక్రియ అధికంగా జరగాలని అభిజిత్ సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చితికిపోయి వుందని, అది విధాన వైఫల్యమేనని పేర్కొన్నారు. కరోనా వైరస్ ఈ వ్యవస్థను మరింత దిగజార్చి వుండవచ్చని, అయితే మంచి ప్రణాళికతో పేదలకు లబ్ధిచేకూర్చేలా చర్యలు చేపడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
పేదల పట్ల చిన్నచూపు!
RELATED ARTICLES