పేట్రేగిన ఇసుక మాఫియా

లారీతో తొక్కించి రైతు దారుణహత్య
మహబూబ్‌నగర్‌ జిల్లా తిర్మలాపూర్‌ గ్రామంలో ఘటన
హత్యకు గురైన నర్సింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్‌
ప్రజాపక్షం/ మహబూబ్‌నగర్‌ బ్యూరో ” ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. తన పొలంలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఓ రైతును ఏకంగా లారీతో తొక్కించి హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుర్రం కాడి నర్సింహులు (38) అనే రైతు తన పొలం నుండి ఇసుక అక్రమ రవాణా చేయొద్దని, గత మూడేళ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని వారి ని వారించాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇసుక తరలిస్తున్న లారీని రైతు నర్సింహులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్‌ నర్సింహులు పైకి లారీ ఎక్కించాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు లారీ డ్రైవర్‌ను పట్టుకున్నారు. వాహ నం అద్దాలను ధ్వంసం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక మాఫి యా రెచ్చిపోతోందని, హత్యలు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇసుక మా ఫియా వల్ల రోడ్డు ప్రమాదంలో అమాయక రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?