5.92 కోట్ల హెక్టార్లుపైనే పంట నాట్లు
37.53 లక్షల హెక్టార్ల మేర తగ్గిన వరి సాగు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 ఖరీఫ్ సాగు నిమిత్తం దేశంలో అన్నిరకాల పంటలకూ వేసిన విత్తన నాట్ల విస్తీర్ణం గత ఏడాది కంటే గణనీయంగా పెరిగింది. ఇలా ఖరీఫ్ నాట్లలో సాగు విస్తార్ణం పెరడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకూ దేశంలో ఐదుకోట్ల 92 లక్షల 11 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణం బాగా పెరిగింది. 2021లో ఐదుకోట్ల 91 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటసాగు ఖరీఫ్‌లో చేశారు. అయితే ఒక్క వరిపంట విషయంలోనే దేశంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.ఎందుకంటే వరిసాగు విస్తీర్ణం దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది కోటీ 55 లక్షల 53 వేల హెక్టార్ల (155.53 లక్షల హెక్టార్లు)లో వరినాట్లు పడ్డాయి. కానీ ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటివరకూ ఈ 45 రోజుల్లో కేవలం కోటీ 28 లక్షల 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే వరినాట్లు పడ్డాయి. అంటే 37.53 లక్షల హెక్టార్ల మేరకు ఈ ఏడాది వరి విస్తీర్ణం తగ్గిపోయింది. ఆ మేరకు నాట్లు పడలేదు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచి కొడుతూ ఉండటంతో రైతుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. మొత్తంగా చూస్తే దేశంలో అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ప్రధామైన తృణధాన్యాల పంటసాగునాట్ల విస్తీర్ణం తగ్గింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సమకూర్చిన తాజా గణాంకాల ప్రకారం జులై 15వ తేదీ నాటికి రైతులు దేశంలో ఐదుకోట్ల 92 లక్షల 11 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అన్ని రకాల పంటల నాట్లు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి ఇప్పటికంటే పదకొండు లక్షలకు పైగా హెక్టార్లల తక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. పంటవారీగా చూస్తే పప్పుధాన్యాలను ఈఏడాది 72.66 లక్షల హెక్టార్లలో
విత్తననాట్లు వేయగా, ఇదే ఖరీఫ్ సీజన్‌లో గత ఏడాది కేవలం 66.69 లక్షల హెక్టార్లలో మాత్రమే పండించారు. వీటిల్లో ఏడాది కంది పంటను 25.81లక్షల హెక్టార్లలలో వేయగా ఇంతకంటే ఎక్కువగానే కంది పంటను గత ఏడాది 31.58 లక్షల హెక్టార్లలో పండించారు. పెసర పంట ఈ ఏడాది 20.19లక్షల హెక్టార్లలో వవేయగా, గత ఏడాది ఖరీఫ్‌లో కకేవలం 15.85 లక్షల హెక్టార్ల మాత్రమే పండించారు.మినుముసాగు ఈ ఏడాది 18.06 లక్షల హెక్టార్లలలో వేస్తే, గత ఏడాది ఇదే సీజన్‌లో కేవలం 15.67 లక్షల హెక్టార్లలో మాత్రమే పండించారు. ఇక తృణ ధాన్యాలను ఈ ఏడాది 93.91 లక్షల హెక్టార్లలో వేయగా, గత ఏడాది 87.06 లక్షల హెక్టార్లలలో మాత్రమమే వేశారు. వీటిల్లో సజ్జలు 34.46 లక్షల హెక్టార్లలో వేయగా గత ఏడాది 20.88 లక్షల హెక్టార్లలో మాత్రమే పండించారు. మొక్కజొన్న సాగు ఈ ఏడాది 49.90 లక్షల హెక్టార్లలో వేశారు. అయితే ఈ సాగు గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గింది. 2021 ఖరీఫ్‌లో 56.69 లక్షల హెక్టార్లలో వేశారు. జొన్న పంటను ఈ ఏడాది 6.78 లక్షల హెక్టార్లలో వేశారు. గత ఏడాది 6.32 లక్షల హెక్టార్లలో వేశారు.
ఇక నూనె విత్తనాల విషయానికి వస్తే, గత ఏడాది కోటీ 24 లక్షల 83 వేల హెక్టార్లలో ఈ పంటలు వేయగా ఈ ఏడాది కోటీ 34 లక్షల నాలుగువేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు వీటిల్లో సోయా చిక్కుడును గత ఏడాదిలో 90.32 లక్షల హెక్టార్లలలో పండిస్తే,ఈ ఏడాది ఖరీఫ్‌లో 99.35 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తులు నాటారు.వేరుసెనగ సాగు మాత్రం గత ఏడాది 29.72 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది అంతకంటే కొంచెం తక్కువగా 28.89లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు.నువ్వుల సాగు ఈ ఏడాది 4.22 లక్షల హెక్టార్లలో వేయగా, గత ఏడాది 3.58 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. ఇక పత్తిపంట సాగు ఈ ఏడాది కోటీ రెండు లక్షల 80 వేల హెక్టార్లలలో వేయగా గత ఏడాది 96.58 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. చెరకు సాగు గత ఏడాది 53.70 లక్షల హెక్టార్లలో చేయగా ఈ ఏడాది 53.31 లక్షల హెక్టార్లలో చేస్తున్నారు. జనపనార పంటను ఈ ఏడాది ఆరు లక్షల 89 వేల హెక్టార్లలో వేశారు. గత ఏడాది ఇంతకంటే ఎక్కువగానే ఆరు లక్షల 92 వేల హెక్టార్లలో పండించారు. ఇక గోగునార పంటను ఈ ఏడాది 6.89 లక్షల హెక్టార్లలో వేస్తే, గత ఏడాది కొంచెం ఎక్కువగా 6.92 లక్షల హెక్టార్లలో పండించారు.
జూన్ నెలలో దేశవ్యాప్తంగా 7.9 శాతం కంటే తక్కువగగా వర్షపాతం నమోదైంది. అనింటికంటే ముఖ్యంగా దేశంలో మొత్తం ఉన్న 36 వాతావరణ శాఖ ఉపవిభాగాల్లో 24 విభాగాలు నమోదు చేసిన వర్షపాతంలో పదీశాతం అదనపు వర్షపాతం కొరత వచ్చింది. అయినప్పటికీ జులై నెలలో సగటు వర్షపాతం కంటే 41.9 శాతం ఎక్కువగానే నమోదైంది.గడచిన 45 రోజుల వర్షపాతాన్ని లెక్కవేస్తే 13.9 శాతం మిగులు వర్షపాతం నమోదైంది. ఈ నెలలో వర్షాలు శుభారంభం చేశాయి. ప్రత్యేకించి భూమి సముద్రంలోకి చొచ్చుకువెళ్ళిన అగ్ర ప్రాంతాలలో, సెంట్రల్, పశ్చిమప్రాంత భారతదేశంలో దీనివల్ల పంటనాట్లు బాగా ఊపు అందుకున్నాయి. సోయా చిక్కుడు, నువ్వులు,పత్తి,సజ్జలు, పెసలు,జొన,మినుములు విత్తడానికి ఈ వర్షాలు ఎంతోదోహదం చేశాయి. కందిపంట, వేరుసెనగ,మొక్కజొన్న పంటలకు ఇంకా విత్తులుమరింతగా పడాల్సి ఉంది.రాబోయే వారాలలో ఈ పంటల విత్తులు పెరుగుతాయని భావిస్తున్నారు.
తగ్గిన వరి విస్తీర్ణం
అయితే ఇప్పుడు దేశంలోవరి పంట సాగు విస్తీర్ణం విషయంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో వరిపంట నాట్లు 37.53 లక్షల హెక్టార్లలో వరనాట్లు పడలేదు. ఉత్తర ప్రదేశ్‌లో వరి విస్తీర్ణం 35.29 లక్షల హెక్టార్ల నుండి 26.98 లక్షల హెక్టార్లకు, చత్తీస్‌గఢ్‌లో19.69 లక్షల హెక్టార్ల నుండి 16.38 లక్షల హెక్టార్లకు,మధ్యప్రదేశ్‌లో 9.63 లక్షల హెక్టార్ల నుండి 7.01 లక్షల హెక్టార్లకు వరినాట్ల విస్తీర్ణం ఈ ఖరీఫ్ సీజన్‌లో తగ్గిపోయింది. అదేవిధంగా, బీహార్‌లో 8.77 లక్షల హెక్టార్ల నుండి 6.06 లక్షల హెక్టార్లకు, పశ్చిమ బెంగాల్‌లో 4.68 లక్షల హెక్టార్ల నుండి 3.94 లక్షల హెక్టార్లకు వరి నాట్లు తగ్గిపోయాయి. మొత్తంగా చూస్తే జులై 15 నాటికి వర్షపాతం లోటు తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో 68.3 శాతం, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో 58.6 శాతం, బీహార్‌లో 42 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 45.5 శాతం మేరకు తగ్గిపోయింది. అయితే ఇంకా ఈ నెలలో 15 రోజులు గడువు ఉన్నందువల్ల పుష్కలంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
RELATED ARTICLES