HomeNewsపెండింగ్‌ సమస్యలపై ఉద్యమిద్దాం

పెండింగ్‌ సమస్యలపై ఉద్యమిద్దాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజాపక్షం/యాదాద్రి:  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజాసంక్షేమ పథకాల అమలు కొరకు రైతాంగానికి సంబంధించి రైతు భరోసా, పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు పథకాల అమలుకు ఉద్యమించాలని, పార్టీని సమన్వయం తో ముందుకు తీసుకెళ్లాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సిపిఐ 100ఏండ్లు పూర్తి చేసుకుంటు న్న సందర్భంగా ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలని శుక్రవారం ఆలేరు టౌన్‌లోని భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మాణ కౌన్సిల్‌ సమావేశం దినేష్‌ గార్డెన్‌లో కామ్రేడ్‌ చెక్క వెంకటేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్‌ పల్ల వెంకట్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకులు ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఈ ప్రాంత సమస్యలపై అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహించి సాయుధ పోరాటాలు నడిపిన గొప్ప నాయకులని అన్నారు. మన పార్టీ వంద సంవత్సరాలు అడుగెడుతున్న సందర్భంలో మన జిల్లా నిర్మాణాలు ప్రజా సంఘాలు జిల్లా స్థాయిలోని ఆవిష్కృతమైన పెండింగ్‌ ప్రాజెక్టుల సాధనకు సిపిఐగా పార్టీ నిర్మాణం చేసుకొని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ దేశ సమగ్రత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యవాదులుగా దేశవ్యాప్తంగా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. దేశంలో మతోన్మాదం, మనువాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని, దేశ సమగ్రతను కాపాడాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, విద్యార్థి, రైతు, యువజన వ్యతిరేక విధానాలని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహాయ కార్యదర్శిలు యానా ల దామోదర్‌ రెడ్డి, బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరు రాజయ్య, బండి జంగమ్మ, ఏషాల అశోక్‌, బోడ సుదర్శన్‌, చెక్క వెంకటేష్‌, బచ్చనాగోని గాలయ్య, కోసమని హరిచంద్ర, కల్లెం కృష్ణ, ఎండి ఇమ్రాన్‌, కొరిమిద్ద శ్రీనివాస్‌, గోరేటి రాములు, రాజమణి, జల్ది రాములు, పల్లె శేఖర్‌ రెడ్డి, బబ్బూరి శ్రీధర్‌, మండ ల కార్యదర్శిలు అన్యపు వెంకట్‌, మారపాక వెంకటేష్‌, కళ్ళేపల్లి మహేందర్‌, చౌడబోయిన కనకయ్య, దుబ్బాక భాస్కర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శలు అభిలాష్‌, ఉప్పుల శాంతి కుమార్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లంకి మహేష్‌, పేరమైన మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments