l సుదీర్ఘ ఐపిఎల్‌తో అలిసి పోయిన కోహ్లీ సేన
l ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్ల ఫామ్‌పై ఆందోళన
ప్రజాపక్షం/క్రీడా విభాగం: ఎడతెరిపి లేకుండా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వల్ల చాలా మంది టీమిండియా క్రికెటర్లు అలసి పోయారని చెప్పక తప్పదు. ప్రపంచకప్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో క్రికెటర్లు కనీస విరామం లేకుండానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఐపిఎల్ ముగిసిన తర్వాత మూడు వారాల సమయమే క్రికెటర్లకు లభించింది. అందులో వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకొంటారు? మళ్లీ ఎన్ని రోజులు ప్రపంచకప్ కోసం సాధన చేస్తారన్నదే ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇప్పటికే పెద్దగా చర్చ జరుగుతోంది. ఐపిఎల్ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెడుతామన్న బిసిసిఐ వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అందుకే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే భారత ఆటగాళ్లు సుదీర్ఘ ఐపిఎల్‌లో ఎడతెరిపిలేకుండా ఆరంభం నుంచి చివరి దాకా దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడారు. ఇక భారత జట్టు కీలక ఆటగాళ్లయిన మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తదితరులు ఈ సీజన్ ఐపిఎల్‌లో ఆఖరు వరకు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు ఫైనల్‌కు చేరడంతో ఈ ప్రధాన ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా పోయింది. అందుకే వీరి ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది. కనీస విశ్రాంతి లేకుండా దాదాపు రెండు నెలలపాటు సుదీర్ఘమైన క్రికెట్‌తో చాలా మంది క్రికెటర్లు అలసి పోయారనే చెప్పాలి. ఐపిఎల్‌లో టీమీండియాకు ఎంపికైన చాలా మంది ఆటగాళ్లు కనీస విరామం లేకుండా తమతమ ఫ్రాంచైజీల తరపున చివరి వరకు ఆడారు. లీగ్ దశలో ఒకొక్క జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడింది. అంటే వారిపై ఎంతగా భారం పడిందో అలోచించవచ్చు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్, సీనియర్లు ధోనీ, జడేజా, భువనేశ్వర్ తదితరులు ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడడంతో వీరు అలసి పోయారు. దీంతో ప్రపంచకప్‌లో వీరు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతారా లేదా అనేది అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. భారత జట్టులో ఎంపికైన ఆటగాళ్లలో ఇప్పటికే కేదర్ జాదవ్ ఫిట్‌నెస్ లేమితో బాధపడ్డాడు. ఇక చివరికి అతను ఫిట్‌నెస్ సాధించాడని టీమిండియ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. భువనేశ్వర్ కుమార్ కూడా ఫిట్‌నెస్‌తో లేడనే వార్తలు వినవస్తున్నాయి. ఇదే జరిగితే భారత్‌కు ప్రపంచకప్‌లో పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి. మరోవైపు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని, ప్రపంచకప్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగుతారనే నమ్మకంతో ఉన్నాడు. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించని మాట వాస్తవమేనని, అయితే దాని ప్రభావం ప్రపంచకప్‌పై పడుతుందని తాను భావించడం లేదని రవిశాస్త్రి ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, కెప్టెన్ కోహ్లీ మాత్రం ప్రారంభం నుంచే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళనతో ఉన్నాడు. ఐపిఎల్‌లో కొంతమంది క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే బిసిసిఐ మాత్రం కోహ్లీ అభ్యర్థనను తోసి పుచ్చింది. ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేందుకు బోర్డు పెద్దలు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఐపిఎల్ ముగిసే వరకు ఆటగాళ్లు తమతమ జట్లలో కొనసాగక తప్పలేదు. ఇక భారత్‌తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా సుదీర్ఘకాలం పాటు ఐపిఎల్‌లో కొనసాగారు. అయితే భారత్‌తో పోల్చితే ఈ జట్ల క్రికెటర్లు కొంత ముందుగానే స్వదేశం వెళ్లి పోయారు. భారత ఆటగాళ్లకు కూడా దాదాపు వారం రోజులకు పైగా విశ్రాంతి లభించింది. దీంతో వీరంతా ప్రస్తు తం తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. త్వరలోనే టీమిండియా ఆటగాళ్లు జట్టుతో కలువనున్నారు.
రోహిత్, ధోనీ, బుమ్రాలపైనే అధిక భారం..
ప్రపంచకప్ భారత జట్టులో ప్రధాన ఆటగాళ్లయిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలపై ఈ సీజన్ ఐపిఎల్‌లో అధిక భారం పడిందనే చెప్పాలి. ముంబయి, చెన్నై జట్టు ఈ సీజన్ ఐపిఎల్ ఫైనల్స్ వరకు చేరడంతో ఈ రెండు జట్లలోని ఆటగాళ్లు సీజన్ ఆరంభం నుంచి చివరి మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. అ లాంటి ఆటగాళ్లలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉండడంతో వీరందరి ఫిట్‌నెస్‌పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఐపిఎల్ సీజన్ ముంబయి జట్టుకు సార థ్యం వహించిన రోహిత్ శర్మ మొత్తం (15)మ్యాచ్‌లు ఆడాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన ధోనీ కూడా మొత్తం (15) మ్యాచ్‌లు ఆడా డు. టీమిండియా ప్రధాన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సైతం (16) మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు పేసర్ బుమ్రా అందరి కంటే ఎక్కువగా మొత్తం (16) మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆటగాళ్లలో అందరూ కనీసం 14 లీమ్ మ్యాచ్‌లు ఆడారు. అందుకే ఇప్పుడు వీరిందరి ఫిట్‌నెస్‌పై ఆందోళన కలుగుతోంది.
ఫిట్‌నెస్‌పై బెంగ వద్దు: రవిశాస్త్రి
ప్రపంచకప్‌లో ఆడబోయే టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బెంగవద్దని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. ఐపిఎల్‌లో సుదీర్ఘ క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని, ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో సత్తా చాటేందు కు అందరూ సిద్ధంగా ఉన్నారని ఆ యన తెలిపారు. ఐపిఎల్‌లో గాయపడిన కేదార్ జాదవ్ ఇప్పుడు కోలుకున్నాడని శాస్త్రి పేర్కొన్నాడు. ఇతర క్రికెటర్లు కూడా ప్రపంచకప్‌కు ముందు పూర్తి విశ్రాంతి తీసుకొంటున్నారు. మరికొన్ని రోజుల్లో అందరూ జట్టుతో కలవనున్నా రు. విరాట్ సారథ్యంలో భారత జట్టు కప్ ఫేవరెట్‌గా బరిలో ది గుతుంది. భారత జట్టు బ్యాటిం గ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టంగా ఉంది. యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ ఐపిఎల్ మంచి ప్ర దర్శన చేశారు. ప్రపంచకప్‌లో కూడా వీరు భారత జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉందని భా రత కోచ్ పేర్కొన్నాడు.