వారం రోజుల్లో 10,867 కరోనా కేసులు నమోదు
24 గంటల్లో 1610 పాజిటివ్‌లు
రాష్ట్రంలో మరో 9 మంది కొవిడ్‌కు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్
‘కొవిడ్ కారణంగా ఒక వారంలోనే 46.13 శాతం మంది మృత్యువాతపడగా ఇతర వ్యాధులతో 53.87 శాతం మంది మరణించారు. మొత్తం 10,867 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందు లో 10,548 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ శాతం పురుషులే కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన వారిలో 25 శాతం మంది ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే కాగా, అందులో 17.7 శాతం పురుషులు, మహిళలు 7.3 శాతం మంది ఉన్నారు. సోమవారం నాడు 1610 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మరణించగా ఆ సంఖ్య 480కి చేరింది. గడిచిన 24 గంటల్లో 15,839 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 809 రిపోర్ట్ రావాల్సి ఉన్నది. 803 మంది డిశ్చార్జ్ కాగా మొ త్తంగా 42,909 మంది కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,79,081 మందికి పరీక్షలు నిర్వహించగా 57,142 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. కరోనా రీకవరి 75.1 శాతం ఉండగా, యాక్టివ్ కేసులు మొత్తం 13,753 ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్‌లో 84 శాతం మంది ఉన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 21 నుంచి 27 వరకు కరోనా హెల్త్ బులెటిన్‌ను మంగళవారం విడుదల చేసింది. హైకోర్టు అసంతృప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కొత్త ఫార్మెట్‌లో 59పేజీలతో కూడిన వారం రోజుల నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మొదటి వరుసలో జిహెచ్‌ఎంసి- (4568 కేసులు), రెండవ స్థానంలో రంగారెడ్డి (-1108), మూడవ స్థానంలో వరంగల్ అర్బన్ -(577), నాల్గొవ స్థానంలో మేడ్చల్- మల్కాజిగిరి- (554) ఉన్నది. అత్యంత తక్కువ కేసులు నిర్మల్‌లో 5, కొమరంబీమ్ ఆసిఫాబాద్ 6 నమోదయ్యాయి.
ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా :
ఆదిలాబాద్-లో 96, భద్రాచలం- కొత్తగూడెంలో -62, జిహెచ్‌ఎంసి-లో 4568, జగిత్యాల-లో 84, జనగాం-లో 90, జయశంకర్ భూపాల్‌పల్లి-లో 109. జోగులాంబ గద్వాల్-లో 89, కామారెడ్డి-లో 209, కరీంనగర్-లో 428, ఖమ్మంలో- 123, కొమరంబీమ్ ఆసిఫాబాద్‌లో -6, మహబూబ్‌నగర్‌లో- 161, మహబూబాబాద్‌లో- 177, మంచిర్యాల-లో 70, మెదక్-లో 150, మేడ్చల్- మల్కాజిగిరిలో- 554, ములుగులో- 95, నాగర్‌కర్నూల్-లో 209, నల్లగొండలో- 242, నారాయణపేట్-లో 23, నిర్మల్‌లో -5, నిజామాబాద్-లో 263, పెద్దపల్లి-లో 191, రాజన్న సిరిసిల్లా-లో 168, రంగారెడ్డిలో-1108, సంగారెడ్డిలో -441, సిద్దిపేట-లో 64, సూర్యాపేటలో -188, వికారాబాద్-లో 45, వనపర్తి-లో 52, వరంగల్ రూరల్-లో 154, వరంగల్ అర్బన్‌లో – 577, యాదాద్రి-భువనగిరిలో- 66 కేసులు నమోదయాయ్యి. కరోనా బారిన పడినవారిలో ఎక్కువగా పురుషులే ఉన్నారు. ఇందులోనూ 31 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉన్నారు. దీనికి సంబంధించిన లెక్కలు కింది విధంగా ఉన్నాయి.
పురుషులనే కాటేస్తోంది!
RELATED ARTICLES