అడిలైడ్ : ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం ప్రారంభమై మొదటి టెస్టులో పుజారా శతకం బాదాడు. టీమిండియా బ్యాట్మెన్లందరూ పెవిలియన్ లైన్ కడుతుంటే పుజారా తనదైన శైలిలో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ 231 బంతుల్లో 104 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కాగా, టెస్టుల్లో పుజారాకిది 16వ శతకం.