ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు
జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఏర్పాటు
అక్టోబర్ 1వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణ
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై అక్టోబరు 1 నుంచి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. శనివారం జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం వచ్చే మంగళవారం నుంచి పిటిషన్లను విచారిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల విచారణ కోసం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ఆ సమయంలో సిజెఐ తెలిపారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాట యింది. అక్టోబరు 1 నుంచి ఈ ధర్మాసనం వాదనలు విననుంది. జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆమోదం లభించింది. అంతేగాక.. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గా విభజిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జమ్ముకశ్మీర్ వ్యాప్తం గా ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రముఖలను గృహ నిర్బంధం చేసిం ది. పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో దశ ల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. అయితే 370ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
పిటిషన్ల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం
RELATED ARTICLES